దేవరన్యాయం వల్ల సంతానం కల్గడం అనే ప్రస్తావన మహాభారత గాధలోని ఆది పర్వంలో వస్తుంది.

దస్త్రం:Vyasa2.jpg
వ్యాసుడు

ఉపయోగించే సందర్భాలు

మార్చు

సంతానం లేక చిత్రాంగదుడు, విచిత్రవీరుడు మరణించినప్పుడు సత్యవతి భీష్ముడిని రాజ్యము స్వీకరించమనగా భీష్ముడు అందుకు నిరాకరిస్తాడు. అప్పుడు సత్యవతి దేవరన్యాయం వల్ల అంబకి, అంబాలిక కి సంతానం కలిగించేటట్లు చేయమని వ్యాసుడిని మనసులో తలచుకొంటుంది. ఆ విధంగా వ్యాసుడిని తలచుకొనే ముందు సత్యవతికి దేవరన్యాయంకి సంబంధించిన ఇతిహాసం చెబుతుంది.

క్షత్రియులు

మార్చు

పరశురాముడి చేత క్షత్రియ వంశాలు నాశనం అవ్వడం వల్ల క్షత్రియలు బ్రాహ్మణుల వల్ల సంతానాన్ని పొందారు. ఉతధ్యుడు, బృహస్తతి అన్నదమ్ములు. ఉతధ్యుని భార్య మమత గర్భవతిగా ఉన్నప్పుడు బృహస్పతి ఉతధ్యుడీ ఇంటి వచ్చి మమత పొందు కోరాడు. దానికి మమత గర్భంలొ ఉన్న పిండంగా అన్యయం అని అరవగా ఆ బాలుడిని పుట్టు గుడ్డిగా చేస్తాడు బృహస్పతి. ఆపుట్టు గ్రుడ్డిగా జన్మించిన వాడు దీర్ఘతముడు. దీర్ఘతముడు వేదవేదాంగాలు అభ్యసించి విద్యుక్తంగా ప్రద్వేషిణి అనే కన్యకను వివాహం ఆడతాడు. దీర్ఘతముడికి ప్రద్వేషిణికి చాల సంతానం కలుగుతుంది. ప్రద్వేషిణికి దీర్ఘతముడు అంటే ఇష్ఠం ఉండేది కాదు. ఒకరోజు ప్రద్వేషిణి పరుషభాషణాలతో దీర్ఘతముడీని దూషించి తన తనయులను పిలిచి దీర్ఘతముడీని నడి లో పాడవేయిస్తుంది. దీర్ఘతముడు నదిలొ కొట్టుకొని పోతున్నా తన వచ్చిన వేదవేదాంగాలు వల్లెవేస్తుంటాడు. ఆ విధంగా కొట్టుకొని పోతుండగా దీర్ఘతముడు బలి అనే రాజు కు దొరుకుతాడు. దీర్ఘతముడి గొప్పతనం తెలుసుకొని ఆ మహారాజు రాజ్యానికి తీసుకొని పోయి సత్కరిస్తాడు. రాజు సంతానం లేకపోవడం వల్ల తన భార్య సుధేష్ణకు ఉత్తమమైన మీవంటి బ్రాహమణుల వల్ల సంతానం కలిగేటట్లు చేయండి అని కోరుతాడు. దీర్ఘతముడు దానికి అంగీకరిస్తాడూ, కాని సుధేష్ణకు దీర్ఘతముడి చూస్తే రోత కలిగి తన దాసి ని పంపుతుంది. ఆ తరువాత దీర్ఘతముడూ రాజు ని కలిసి జరిగింది చెప్పి రాజ్యాన్ని దాసీ పుత్రులు ఏలు తారు అని అనగా, ఆ రాజు మళ్ళి తన భార్య సుధేష్ణవద్దక్లు వెళ్ళి ఆమె ను పంపుతాడు. ఆ విధంగా సుధ్గేష్ణతో సంభోగించడం వల్ల దేవరన్యాయం వ్లాల్ అంగరాజు అనే పుత్రుడూ కలుగుతాడు. ఈ ఇతి వృత్తాంతం చెప్పినవెంటనే సత్యవతి పరాశరుడి వల్ల జన్మించిన సంతానం వ్యాసుడు గుర్తుకు వస్తాడు.


సూచికలు

మార్చు

బయటి లింకులు

మార్చు