దేశ భాషలందు తెలుగు లెస్స

ఆంధ్ర భోజునిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడిన శ్రీ కృష్ణదేవ రాయలు తెలుగు భాషకు దేశ భాషలందు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పలికిన పలుకులు ఇవి.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - దేశ భాషలందు తెలుగు లెస్స, "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ," పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స

శ్రీ కృష్ణదేవ రాయలు

వల్లభరాయుని పద్యం

మార్చు

శ్రీకృష్ణదేవరాయల కన్నా ముందుగా 15వ శతాబ్ది తొలి అర్థభాగంలో జీవించిన వినుకొండ వల్లభరాయుడు ఈ పద్యంలో ప్రముఖవాక్యమైన దేశభాషలందు తెలుగు లెస్స వాక్యాన్ని ఉటంకించారు. వల్లభరాయలు క్రీడాభిరామమనే వీథి నాటకాన్ని రచిస్తూ ప్రస్తావనలోని 37వ పద్యంగా రచించిన జనని సంస్కృతంబులో ఈ వాక్యం ప్రస్తావనకు వస్తుంది. ఆ పద్యం ఇది:

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి దల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?

వినుకొండ వల్లభరాయుడు

శ్రీనాథ యుగానికి చెందిన వినుకొండ వల్లభరాయుడు రచించిన వ్యంగ్య, శృంగారభరిత నాటకమైన క్రీడాభిరామం భాష, పదప్రయోగాల ప్రభావం శ్రీకృష్ణదేవరాయలపై ఉందని సింగరాచార్యులు వంటి సాహిత్య విమర్శకుల అభిప్రాయం.

ఇవి కూడా చూడండి

మార్చు

తెలుగు తల్లి

ప్రపంచ తెలుగు మహాసభలు

బయటి లింకులు

మార్చు