దోమ రక్తాన్ని పీల్చి చాలా వ్యాధులకు కారణమైన కీటకము. దోమలు ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణ మండల దేశాలలో అధికంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మూడు రకాల దోమలు వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. అవి కులిసిడే కుటుంబానికి చెందిన క్యూలెక్స్, అనాఫిలస్, ఈడిస్ దోమలు. వీటి దేహంలో తల, వక్షం, ఉదరం అనే మూడు భాగాలుంటాయి. మధ్యవక్షానికి ఒక జత రెక్కలు ఉంటాయి. అంత్యవక్షానికి చెందిన రెక్కలు 'హాల్టర్లు' గా ఉండి శరీర సమతాస్థితికి పనిచేస్త్రాయి. ఆడ దోమలలో గుచ్చి పీల్చేరకమైన ముఖభాగలుంటాయి. ఇవి మానవులమీద అంతరాయక బాహ్య పరాన్న జీవులుగా బ్రతుకుతాయి. మగ దోమలు మొక్క స్రావాల మీద బ్రతుకుతాయి.

దోమ
Anopheles gambiae
Secure
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Infraorder:
Family:
కులిసిడే
ప్రజాతి

See text.

Diversity
41 ప్రజాతులు

ఇవి నీటిలో ఉండే సేంద్రియ పదార్ధాలను తింటాయి. ఇవి రూపవిక్రియ జరుపుకొని ప్యూపాలుగా ఏర్పడతాయి. డింభకాలు శ్వాస గొట్టాలతోను, ప్యూపాలు అంకుశ నాళాలు, తుత్తారలతోను గాలిని పూల్చుకొంటాయి. సాధారణ వ్యక్తులతో పోల్చితే మద్యం తాగిన వారిపై దోమలు అధికంగా దాడి చేస్తాయట.

వ్యాధులు

మార్చు

అవతార్‌(మలేరియా నిరోధక) దోమలు

మార్చు

మలేరియా నుంచి కాపాడే కొత్త అవతార్‌ (టీకా) దోమల్నిశాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ దోమలు కుడితే మనిషిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మలేరియాను నియంత్రించడానికి వీలవుతుంది. దోమ లాలాజల గ్రంథుల నుంచి 'లైస్మేనియా' టీకా మందు వెలువడేలా వాటి జన్యు క్రమంలో మార్పు తెచ్చారు. మలేరియా వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 10-20 లక్షల మంది మరణిస్తున్నారు.మలేరియా పరాన్నజీవ మణిరాజు (ప్లాస్మోడియం) రాకను నిరోధించే విధంగా దోమ జన్యుక్రమంలో కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత ఆ మార్పులతో కూడిన జన్యుసమాచారాన్ని దోమ అండాల్లో ప్రవేశపెట్టారు. వాటినుంచి పుట్టిన కొత్తతరం దోమలు మలేరియా వ్యాధి నిరోధకతను సంతరించుకున్నాయి. ఆ దోమలకు ప్లాస్మోడియంతో కూడిన రక్తాన్ని అందించి పరీక్షించారు. రక్తం తాగినప్పటికీ ఒక్క దోమలోకి కూడా పరాన్నజీవి ప్రవేశించలేకపోయింది. 'దోమల జీవితకాలం రెండువారాలకు మించదు. ఈ నేపథ్యంలో భూమ్మీద ఉన్న సాధారణ దోమలను తొలగించివేస్తూ వాటి స్థానంలో జన్యుపరివర్తిత దోమలను ప్రవేశపెట్టటం అసాధ్యమేమీ కాదు.

దోమల నియంత్రణ

మార్చు
  • నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, చెత్తా చెదారం నిల్వ ఉండే చోట్ల శుభ్రం చెయ్యాలి.
  • ఫ్రిడ్జ్‌ కింద ఉండే నీటి ఫ్యానుల్లో నిల్వ ఉండే నీటిలో కూడా దోమలు పెరుగుతాయి. ఆ నీరు ఎప్పటికప్పుడు పారబోయాలి.
  • పూలకుండీల్లో నిల్వ ఉండే నీరు కూడా దోమలు పెరిగేందుకు అనుకూలమే. ఆ నీరు ఎప్పటికప్పుడు బయటకి పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుండీకి చిన్న కన్నం చేసి చొక్కా బొత్తాం అతికించడం వల్ల నీరు బయటకు పోతుంది. మట్టి పోకుండా కాపాడుకోవచ్చు.
  • సెప్టిక్‌ ట్యాంకుల నుండి దుర్వాసన పోయే గొట్టాలకు తీగ మెస్‌ జల్లెడలు బిగించాలి.సెప్టిక్‌ ట్యాంకులో కొంచెం కిరోసిన్ పోయాలి.
  • పాత టైర్లు, తాగి పారేసిన కొబ్బరి బొండాలు, వాడి విసిరేసిన ప్లాస్టిక్‌ టీ కప్పులను దూరంగా తరలించాలి.లేదా తగలబెట్టాలి.
  • లేఅవుట్లలో ఇళ్లు కట్టకుండా ఉంచేసిన ఖాళీ స్థలాల చుట్టూ రోడ్లు వచ్చిస్థలాలు లోతట్టు ప్రాంతాలుగా మారడంతో వర్షపు నీటితో నిండిపోతున్నాయి. దోమలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. వాటిని పూడ్పించాలి.
  • నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్‌ చేయాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=దోమ&oldid=4270854" నుండి వెలికితీశారు