ధృష్టద్యుమ్నుడు

మహాభారతం లో పాత్ర
(ద్రుష్ట్యద్యుమ్నుడు నుండి దారిమార్పు చెందింది)

ధృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు. ద్రౌపది అన్న. ద్రుపదుడు చేసిన యజ్ఞంలో ద్రౌపదితో పాటు ధృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. తన మిత్రుడు తనను అవమానించిన పాండవుల గురువు ద్రోణుని సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా వరం చేత ధృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఇతడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుని హతమార్చి, తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు. తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా ద్రోణుడి కొడుకైన అశ్వత్థామ చేతిలో ఉపపాండవులతో పాటు మరణిస్తాడు.

దస్త్రం:Drishtadyumna as Commander in chief of Pandava's Army.jpg
కురుక్షేత్ర సంగ్రామంలో పాండవల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ధృష్టద్యుమ్నుని దృశ్య చిత్రం

కథ మార్చు

ధృష్టద్యుమ్నుడు పుట్టడమే ద్రోణున్ని సంహరించడానికి పుడతాడు. అయినా సరే ద్రోణుడు అతన్ని శిష్యుడిగా స్వీకరిస్తాడు. ద్రౌపది స్వయంవరం సమయంలో ధనుర్విద్యలో గెలిచి తన చెల్లెల్ని వివాహం చేసుకున్న బ్రాహ్మణ యువకుణ్ణి వెంబడిస్తూ వెళ్ళి అతను పాండవ మధ్యముడు అర్జునుడు అని కనుగొంటాడు.[1]

యుద్ధం మార్చు

కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడి తర్వాత ద్రోణాచార్యుడు సర్వసేనాధ్యక్షుడవుతాడు. ద్రోణుడు ఆయుధం పట్టుకుంటే అతన్ని ఎదిరించి ఎవరూ పోరాడలేరని భావించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామ హతః (అశ్వత్థామ చనిపోయాడు) అని పెద్దగా కుంజరః (ఏనుగు) అని చిన్నగా వినపడకుండా ధర్మరాజు చేత అనిపిస్తాడు. అది విని ఆయుధాన్ని విసర్జిస్తాడు ద్రోణుడు. అదే సమయంలో అతని శిరసు ఖండించి సంహరిస్తాడు ధృష్టద్యుమ్నుడు. మాయోపాయంతో తన తండ్రిని చంపిన విధానాన్ని చూసి కోపంతో రేగిపోతాడు అశ్వత్థామ. పాండవులనందరినీ చంపి తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. రాత్రి సమయంలో పాండవుల శిబిరానికి వెళ్ళి ఉపపాండవులు (ఐదుమంది)తో పాటు ధృష్టద్యుమ్నుడిని కూడా సంహరిస్తాడు. పాండవులు, కృష్ణుడు శిబిరానికి తిరిగి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి అశ్వత్థామపై పగ తీర్చుకోవాలనుకుంటారు. యుద్ధంలో పాండవులు ఎదురైనప్పుడు వారిని సంహరించడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అవి రెండూ ఉపసంహరించుకోకపోతే ప్రళయం సంభవించి జగత్తు మొత్తం నాశనమైపోతుందని దేవతలు వారిని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ మాత్రం ఉత్తర గర్భంలో ఉన్న శిశువును సంహరిస్తే పాండవుల వంశం నశిస్తుందని అలా దారి మళ్ళిస్తాడు. కాని కృష్ణుడు ఆ బిడ్డను తిరిగి బతికించి, అలాంటి పాపపు పనిని చేసినందుకు అతని నుదుటిపై ఉన్న మణిని తీసివేయమంటాడు.[2]

మూలాలు మార్చు

  1. "Positive thinking: Dhrishtadyumna". DNA. 7 December 2012.
  2. Staff, India com (2020-06-04). "Mahabharat Mythology: Is Ashwatthama Still Alive Even After so Many Years?". India News, Breaking News, Entertainment News | India.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-08.