ద్వంద్వార్థంను ఆంగ్లంలో డబుల్ మీనింగ్ లేక డబుల్ ఎన్‍టెన్‍డ్రీ (Double entendre) అంటారు. ద్వంద్వార్థం అంటే రెండు అర్థాలనిచ్చే పదం. ఉదాహరణకు ఒక పద్యంలో ఒక స్త్రీని వర్ణిస్తూ ఆమె మోము తామర, కన్ను తామర, చరణములు తామర, కరంబులు తామర అని ఉంది. ఒక హాస్యశీలుడు ఆ పద్యాన్ని చదివాడు. ఇదేమిటబ్బా ! ఎక్కడన్నా మొలతామర విన్నాము గాని ఈమె ఒళ్ళంతా తామరేనట. ఇదేదో దూలగొండిలాగుంది అన్నాడట. పద్యంలో తామర అంటే పద్మం అనే అర్థంలో వాడబడింది. కాని తామర అంటే చర్మవ్యాధి కూడా ఒకటి ఉంది. అది అంటుకుంటే త్వరగా వదలదు. స్త్రీ ముఖాన్ని, కన్నులు, చరణాలు, కరాలు పద్మంతో పోల్చుట కవుల అలవాటు, పద్మానికి బదులు తామర అనడంతో అక్కడ హాస్యం విరబూసింది.

1814 నాటి ఒక ద్వంద్వార్థపు నగిషీ. అతడు : నా తీపి తేనె నా నమ్మకం నువ్వు లాడ్‍జిన్స్ తో ఉంటే వీలుగా ఉంటుందని. ఆమె : లేదు సార్ ఒంటరిగా ఉంటేనే నాకు వీలుగా ఉంటుంది.


మూలాలు

మార్చు

8వ తరగతి తెలుగు స్టడీ మెటీరియల్