ద్వారకనాథ్ తివారీ

భారతీయ రాజకీయవేత్త

ద్వారకనాథ్ తివారీ బీహార్‌కు చెందిన భారతీయ రాజకీయవేత్త. ఇతను 1901 సంవత్సరంలో జన్మించాడు. అతను గోపాల్‌గంజ్ లోక్‌సభ సభ్యుడు. అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు, జైలు పాలయ్యాడు.[1] అతను 1వ లోక్ సభకు బీహార్ లోని సరన్ దక్షిణ లోక్ సభ నియోజకవర్గం నుండి భారత కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా గెలుపొందాడు. [2] 2వ లోక్ సభకు అసోం లోని చచర్ లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందాడు. [3] అతను 3వ లోక్ సభకు బీహార్ లోని గోపాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిపొందాడు. [4] మరల గోపాల్‌గంజ్ నియోజకవర్గం నుండి నాల్గవ లోక్ సభకు, ఐదవ లోక్ సభకు ఎన్నికయ్యాడు.[5] ఆరవ లోక్ సభకు అదే నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.[6]

ఇతర వివరాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Members Bioprofile". Archived from the original on 28 July 2014. Retrieved 23 July 2014.
  2. "Members : Lok Sabha". loksabha.nic.in. Retrieved 2021-10-26.
  3. "Members : Lok Sabha". loksabha.nic.in. Retrieved 2021-10-26.
  4. "Members : Lok Sabha". loksabha.nic.in. Retrieved 2021-10-26.
  5. "Members : Lok Sabha". loksabha.nic.in. Retrieved 2021-10-26.
  6. "Members : Lok Sabha". loksabha.nic.in. Retrieved 2021-10-26.