ద్వ్యర్థి కావ్యం

ద్వ్యర్థి కావ్యం చాలా విలక్షణమైన, కష్టభరితమైన ప్రక్రియ. ఒకే కావ్యానికి రెండు అర్థాలు వచ్చేలా రచిస్తే దాన్ని ద్వ్యర్థి కావ్యమని పిలుస్తారు. రాఘవ పాందవీయమనే గ్రంథాన్ని ఉదాహరణగా స్వీకరిస్తే అవే పద్యాలు రామాయణ పరంగా చదువుకుంటే రామాయణంగానూ, మహాభారతంగా అర్థం చేసుకుంటే భారతంగానూ అర్థం వచ్చేలా రచించారు. ఇలాంటి గ్రంథాన్ని రచించడానికి విస్తృతమైన భాషా పరిజ్ఞానం, లోతైన సాహిత్య పాండీత్యం అవసరం.

చరిత్ర మార్చు

ద్వ్యర్థి కావ్యాన్ని మొదట వేములవాడ భీమకవి వ్రాశాడని ప్రతీతి. అయితే ఆ కావ్యం లభించడంలేదు. ఆయన 11వ శతాబ్ది వాడు కాగా ఆయన అనంతరం 16వ శతాబ్ది వరకూ ద్వ్యర్థి కావ్యాలు రాలేదు. ప్రస్తుతానికి లభిస్తున్న ద్వ్యర్థి కావ్యాన్ని రచించినవారు పింగళి సూరన. సూరన కూడా వేములవాడ భీమకవిని గురించి తలుస్తూ పెద్దలు వేములవాడ భీమన ద్వ్యర్థి కావ్యాన్ని వ్రాశాడని చెప్తారు, అలా అని వినడమే తప్ప చదివేందుకు దొరికింది లేదని వ్రాశారు. పింగళి సూరన వ్రాసిన రాఘవ పాండవీయం తొలి తెలుగు ద్వ్యర్థి కావ్యంగా నిలుస్తోంది. సూరన కావ్యం తర్వాత రామరాజభూషణుడు, కృష్ణాధ్వరి వంటివారు రచించారు. దక్షిణాంధ్రయుగంలో ద్వ్యర్థి కావ్యాలు విలసిల్లాయి. ఆధునిక యుగంలో కూడా పలు ద్వ్యర్థి కావ్యాలు వచ్చాయి.[1]

తెలుగులో ప్రఖ్యాత ద్వ్యర్థి కావ్యాలు మార్చు

  • రాఘవ పాండవీయం
  • అచలాత్మజా పరిణయం

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. నండూరి, విశ్వేశ్వరరావు (March 2002). "తెలుగులో అనేకార్థ కావ్యాలు". ఈమాట. Retrieved 10 March 2015.