బౌద్ధ ధర్మ గ్రంథ సంపుటి అయిన త్రిపిటకాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రసిధ్ధికెక్కిన గ్రంథము ధమ్మపదం. ఈ గ్రంథము నాలుగు వందల ఇరవై మూడు గాథలలో బుద్ధుని బోధనలు సంక్షిప్త రూపములో ఉంది. ఈ గ్రంథము పూర్తిగా పద్యరూపంలో ఉంది. బుద్ధుని బొధనలు సమాన్య ప్రజలకు అర్ధమయ్యె విధంగ సరళమైన శైలిలో ఈ పద్యాలు ఉంటాయి. ముఖ్యంగా తెరవాద శాఖకు చెందిన బౌద్ధ మతవాదులు ఈ గ్రంథములోని పద్యాలు వేరు వేరు సందర్భాల్లో బుద్ధుడు స్వయంగా పలికినవని భావిస్తారు.[1]

ధర్మ చక్రం

త్రిపిటకాలు బుద్ధుని కాలములోని సామాన్య జన బాహుళ్యానికి అర్ధమయ్యే పాళీ భాషలో రాయబడినవి. త్రిపిటకాలలో మొదటిదైన[2] సుత్తపిటకంలో బుద్ధుని ఉపదేశాలను, సంభాషణలను ఏర్చికూర్చారు.[3] సుత్తపిటకం దీఘనికాయ, మజ్జిమనికాయ, సంయుత్తనికాయ, అంగుత్తారనికాయ, ఖుద్దకనికాయ అనే ఐదు నికాయాలు ఉంది. ధమ్మపదం, ఖుద్దకనికాయానికి చెందిన పదిహేను గ్రంథాలలో[4] ఒకటి. ఈ గ్రంథంలో నాలుగు వందల ఇరవై మూడు పద్యాలు ఇరవై ఆరు వర్గాలలో ఉన్నాయి.

వర్గాలు

మార్చు
1. యమక వర్గం
2. అప్రమాద వర్గం
3. చిత్త వర్గం
4. పుష్ప వర్గం
5. బాల వర్గం
6. పండిత వర్గం
7. అర్హత వర్గం
8. సహస్ర వర్గం
9. పాప వర్గం
10. దండ వర్గం
11. జరా వర్గం
12. ఆత్మ వర్గం
13. లోక వర్గం
14. బుద్ధ వర్గం
15. సుఖ వర్గం
16. ప్రియ వర్గం
17. క్రోధ వర్గం
18. మల వర్గం
19. ధర్మస్థ వర్గం
20. మార్గ వర్గం
21. ప్రకీర్ణక వర్గం
22. నిరయ వర్గం
23. నాగ వర్గం
24. తృష్ణా వర్గం
25. భిక్షు వర్గం
26. బ్రాహ్మణ వర్గం

మూలాలు

మార్చు
  1. ""The Dhammapada: The Buddha's Path of Wisdom", translated from the Pali by Acharya Buddharakkhita, with an introduction by Bhikkhu Bodhi". Access to Insight. 29 August 2011. Retrieved 13 November 2013.
  2. "Sutta Pitaka". The Dhamma Encyclopedia. 28 August 2010. Archived from the original on 16 మే 2013. Retrieved November 13, 2013.
  3. ధమ్మపదం [Dhammapdam] (in Telugu). అనువాదం గజ్జెల మల్లారెడ్డి. ఆనంద బుద్ధ విహార. 1996. p. XXXIII.{{cite book}}: CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link)
  4. "Khuddaka Nikaya". Encyclopædia Britannica Online. 2013. Retrieved November 13, 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=ధమ్మపదం&oldid=3896700" నుండి వెలికితీశారు