ధర్మన్ షణ్ముగరత్నం

సింగపూర్ నూతన అధ్యక్షుడిగా భారతీయ సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త ధర్మన్ షణ్ముగరత్నం ఎన్నికయ్యారు.[1] ధర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ తొమ్మిదవ అధ్యక్షుడిగా 2023 సెప్టెంబర్ 14వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు.[2] సింగపూర్ లోని 1504 సంవత్సరాల చారిత్రాత్మక అధికార భవనం ఇస్తానాలో భారత సంతతికి చెందిన చీఫ్ జస్టిస్ సుందరేష్ మీనన్ ఈ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు.[3] ధర్మన్ షణ్ముగరత్నం పదవి కాలం ఆరేళ్లు. 2011 తర్వాత దేశంలో తొలిసారిగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ధర్మన్ షణ్ముగరత్నం విజయం సాధించారు. ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్ సాంగ్ పై విజయం సాధించారు.[4] ధర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన మూడవ భారత సంతతికి చెందిన వ్యక్తి. గతంలో భారతీయ సంతతికి చెందిన ఎస్. రామనాథన్, దేవన్ నాయర్ సింగపూర్ అధ్యక్షులుగా పనిచేశారు.

ధర్మన్ షణ్ముగరత్నం నేపథ్యం మార్చు

ప్రముఖ ఆర్థిక వేత్తగా అంతర్జాతీయంగా పేరున్న ధర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో 1957 సంవత్సరంలో జన్మించారు. షణ్ముగరత్నం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పట్టా పొందారు. తర్వాత కేం బ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ.. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. 2001 సంవత్సరంలో షణ్ముఖ రత్నం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2011 సంవత్సరం నుండి 19 సేవలందించారు. 2019 - 2023 మధ్యకాలంలో సీనియర్ మంత్రిగా క్యాబినెట్లో విధులు నిర్వహించారు. మూలాలు :

  1. "Tharman Shanmugaratnam", Wikipedia (in ఇంగ్లీష్), 2023-10-30, retrieved 2023-10-31
  2. "Indian-origin economist Tharman Shanmugaratnam sworn in as Singapore's president". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-10-31.
  3. "Tharman Shanmugaratnam: Singapore picks a president who could've been much more". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2023-09-01. Retrieved 2023-10-31.
  4. "Who is Tharman Shanmugaratnam? Tamil-origin economist who was elected as Singapore President". The Economic Times. 2023-09-02. ISSN 0013-0389. Retrieved 2023-10-31.