ధర్మానంద కోసంబీ స్వీయకథనం నివేదన

ధర్మానంద కోసంబీ స్వీయకథనం నివేదన భారతదేశంలో బౌద్ధధర్మ పునరుద్ధరణ కోసం కృషిచేసిన ధర్మానంద కోంసంబీ మరాఠి భాషలో రచించిన ఆత్మకథ 'నివేదన' తెలుగువారికి అందుబాటులోకి రావడానికి ఏభై ఏళ్ళుపట్టింది. కోసంబీ మనుమరాలు, విదుషీమణి మీరా కోసంబీ ఇంగ్లీషులోకి అనువాదం చేసిన తరువాతనే ఆ రచన ప్రపంచానికి పరిచయం అయింది. తెలుగులో బౌద్ధ సాహిత్యం పరిచయం చేస్తూ, బౌద్ధమత సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్న శ్రీ డి.చంద్రశేఖర్ నివేదనను చక్కగా అనువాదం చేసి, ఈ రచనద్వారా ధర్మానంద కోసంబీ జీవితం, కృషి, అన్వేషణ పాఠకులకు పరిచయం చేశారు. జిజ్ఞాసువులందరూ తప్పక చదవవలసిన పుస్తకం ఇది.సుప్రసిద్ధ మార్క్సిస్టు చరిత్రకారులు, పాళీ పండితులు డి.డి.కోసంబీ ఈ ధర్మానంద కుమారులే.

ఆధునిక భారత చరిత్రలో పాళి బౌద్ధగ్రంథాల అధ్యయనానికి బాటలు వేసిన తొలి పండితులు ధర్మానంద కోసంబీ.(1876-1947).

కోసంబీలు కొన్ని తరాల క్రితం గోవాలోని సంఖ్యాల్ అనే గ్రామంలో స్థిరపడ్డారు. ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం, ధర్మానంద విద్యకోసం పడిన తపన, అతని శ్రద్ధ దాదాపు 1950 నాటి తరంవరకూ చదువులకోసం మన పెద్దలు పడిన శ్రమే.

మూలాలు: నివేదన, ధర్మానంద కోసంబీ స్వీయకథనం, తెలుగు అనువాదం:డి.చంద్రశేఖర్,2022.