ధర్మేంద్ర ప్రధాన్
ధర్మేంద్ర ప్రధాన్ (జననం 1969 జూన్ 26) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖ, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ధర్మేంద్ర ప్రధాన్ | |||
| |||
విద్యా శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | రమేష్ ఫోక్రియాల్ | ||
పెట్రోలియం, సహజవాయువు శాఖ
| |||
పదవీ కాలం 2014 మే – 2021 జులై | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | వీరప్ప మొయిలీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఒడిషా, భారతదేశం | 1969 జూన్ 26||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
సంతానం | 2 | ||
వెబ్‌సైటు | dpradhanbjp.com |
మధ్య ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఇతను 2017 సెప్టెంబరు 3న కేంద్ర మంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు ఈయన 14వ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు.[1][2]
తొలినాళ్ళ జీవితం
మార్చుఇతని తండ్రి దేబేంద్ర ప్రధాన్, వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1999 నుండి 2004 వరకు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిషా రాష్ట్రంలోని తల్చర్ పట్టణంలో జన్మించాడు.[3]
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో కళాశాలలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో సభ్యునిగా ఉండేవాడు, 1983లో ఏబీవీపీ సెక్రెటరీగా ఎన్నికయ్యాడు. ప్రధాన్ భువనేశ్వర్లోని ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి ఆంత్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు.
రాజకీయ జీవితం
మార్చుభారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు చేపట్టిన తర్వాత ప్రధాన 14వ లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు ఆ తర్వాత బీహార్ ఇంకా మధ్యప్రదేశ్ నుండి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
చేపట్టిన పదవులు
మార్చు- కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రి[4]
- కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి
- విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ మంత్రి[5]
మూలాలు
మార్చు- ↑ "Dharmendra Pradhan: Age, Biography, Education, Wife, Caste, Net Worth & More - Oneindia". www.oneindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-13. Retrieved 2021-07-13.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ "Dharmendra Pradhan: Ujjwala Man who helped BJP make inroads in Patnaik's citadel". The Economic Times. Retrieved 2021-07-13.
- ↑ "'Ispati Irada' launched by Pradhan during Steel Chintan Shivir". psuwatch.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-07-13.
- ↑ "2.5 Crore people trained under Skill India in 3 years". outlookindia.com/. Retrieved 2021-07-13.