ధర్మసింధు పుస్తక ముఖచిత్రం.

ధర్మ సింధు శ్రీ కాశీనాథోపాధ్యాయుడు రచించిన ప్రామాణిక గ్రంథం. ఇది 1809లో రచించబడినది.

ఈ గ్రంథకర్త మనుస్మృతి, పురుషార్థ చింతామణి, కౌస్తుభము, కాలమాధవీయం అపరార్క వ్యాఖ్యానం, రామార్చన చంద్రిక మొదలైన ధర్మశాస్త్రాలను పరిశీలించి ఈ గ్రంథాన్ని రచించినట్లుగా పరిశీలకుల అభిప్రాయం. కావున ఇది సంకలన గ్రంథం కానీ స్వంత రచన కాదని తెలుస్తుంది.

శ్రీ కొల్లూరి కామశాస్త్రి ఉభయ భాషా ప్రవీణుడు మరియు విజయనగర సంస్థానంలో పండితుడు. మహారాజా ఆనంద గజపతి గారి ఆనతి మేరకు ధర్మ సింధు గ్రంథాన్ని సంస్కృతం నుండి తెలుగులోనికి తెచ్చిన తొలి ఘనుడు ఈయనే. ఇది గ్రాంధిక భాషలో రచించబడినది.

ప్రస్తుత కాలంలో తెలుగు పండితులైన శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు కాలానుగుణమైన వ్యావహారిక భాషను ఉపయోగించి రచించారు.

ముద్రణలుసవరించు

  • 1930 : వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారు మద్రాసులో ముద్రించారు.
  • 1999 : శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్, హైదరాబాద్ వారు 760 పేజీల బౌండ్ పుస్తకంగా పునర్ముద్రించి విడుదల చేశారు.
  • 2008 : బాలసరస్వతి బుక్ హౌస్ వారు 802 పేజీల బౌండ్ పుస్తకంగా పునర్ముద్రించారు.
  • 2009 : దీనిని నవరత్న బుక్ హౌస్, విజయవాడ 2009 సంవత్సరంలో తొలిసారిగా ముద్రించారు.

బయటి లింకులుసవరించు