ధూర్జటి ఖతి యూనికోడ్లో రూపొందించబడిన తెలుగు ఖతి. ఈ ఖతి 2012 నవంబరులో విడుదల చేసిన తెలుగు విజయం ఖతులలో ఒకటి. సిలికానాంధ్ర సారధ్యంలో తయారైన ఒక ఖతి [1]ఇవి 2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు సందర్భంగా 2-11-2012 నవిశాఖపట్టణం లో విడుదల చేసిన ఏకరూప ఖతుల లలో ధూర్జటి కూడా ఒకటి . దీనిని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్హు. ముద్రణారంగంలో వున్న తెలుగు ఫాంట్లలోని లోటుపాట్లను గమనించి ముద్రణకు అనుకూలంగా ఈ ఖతిని పురుషోత్త్ కుమార్ గుత్తుల తయారు చేశారు.[2] గూగుల్ ఇచ్చే తెలుగు యూనికోడ్ ఖతులలో ధూర్జటి కూడా ఉన్నది . @font-face అనే CSS3 సౌలభ్యం ద్వారా వాడుకరుల కంప్యూటర్లలో ఈ ఖతులు లేకున్నా సర్వర్ నుండి అప్పటికప్పుడు తెచ్చి చూపించవచ్చు. .ఈ సౌలభ్యం వలన ప్రత్యేకంగా ఈ ఫాంట్ ను స్థాపించుకొనే అవసరం లేదు.[3]

ధూర్జటి ఖతిలో అక్షరాల స్వరూపం

ఈ ధూర్జటి ఖతి తెలుగు పలకలుగా ఉండటం వలన ఈనాడు పత్రిక లోగోను పోలి ఉంటుంది , ఇది శీర్షికలు, పోస్టర్లు, ఆహ్వానాలకు అనువైనది.

తెలుగు యీనికోడ్ ఖతిని ను 2013 లో పురుషోత్త్ కుమార్ గుత్తుల రూపకల్పన చేసి అభివృద్ధి చేశారు , సిలికాన్ ఆంధ్ర సిల్ ఓపెన్ ఫాంట్ లైసెన్స్ v1.1 కింద అందుబాటులో ఉంచారు.ధూర్జటి అనేది చతురస్రాకార డిజైన్, గుండ్రని అంచులతో కూడిన తెలుగు ఫాంట్. ఇది సంప్రదాయ భారతీయ భావనను రేకెత్తించే అలంకార అచ్చుగుర్తులను కలిగి ఉంది, పెద్ద సైజుల్లో హెడ్ లైన్ లు, ఆహ్వానాలు, పోస్టర్లు, ఇతర ఉపయోగాల కొరకు తగినది. ధూర్జటి అనే రాజు కృష్ణదేవరాయల ఆస్థానంలో నించైనా తెలుగు కవి గా పేరు పొందాడు. అక్కడ అష్టదిగ్ఘజలు (అక్షరాలా ఎనిమిది పురాణగాథలు) ఒకటి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ సిలికానాంధ్ర సంస్థ కలసి మొత్తం 18 తెలుగు ఖతులను తెలుగు విజయం ప్రాజెక్టు ద్వారా అందించాయి. అలానే, సురవర వారు స్వర్ణ, సంహిత అనే మరో రెండు ఖతులను ఉచితంగా అందిస్తున్నారు. వీటిని దింపుకొని మన కంప్యూటర్లలో స్థాపించుకుని మనం ఉపయోగించుకోవచ్చు. ఇది మీ కంప్యూటర్లో కొత్త తెలుగు ఖతులు లేకున్నా మీకు ఆ పేజీ తెరపట్టులో చూపిన విధంగా కనబడుతుంది. గమనిక: ఈ జాల ఖతుల సౌలభ్యం కనీసం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (IE) 9 లేదా ఫైర్‌ఫాక్స్, క్రోమ్, ఓపెరా, సఫారీ వంటి విహారిణులలో పనిచేస్తుంది.

ఈ జాల ఖతుల సౌలభ్యాన్ని మన జాల పుటలలో వినియోగించుకోడానికి, మనకు కావాలసిన ఖతులను ముందుగా మన సర్వర్ లోనికి ఎక్కించాలి. ఆ తర్వాత CSS ఫైలులో (లేదా HTML ఫైలులో నేరుగా CSS ద్వారా), @font-face అన్న నియమం ద్వారా ఖతిని నిర్వచించాలి. ఆపై, కావలసిన అంశాలకు ఆ ఖతిని వర్తింపజేయవచ్చు.

ధూర్జటి ఖతిని నిర్వచించడం మనం జాల ఖతిగా ఉపయోగించిన ఖతి వాడుకరి కంప్యూటర్లో ఉంటే (మనం సర్వరు నుండి దింపుకోకుండా) దాన్నే ఉపయోగించవచ్చు. అందుకు src లక్షణానికి local() విలువనూ ఇవ్వవచ్చు.


ఈ జాల ఖతుల సౌలభ్యాన్ని మన జాల పుటలలో వినియోగించుకోడానికి, మనకు కావాలసిన ఖతులను ముందుగా మన సర్వర్ లోనికి ఎక్కించాలి. ఆ తర్వాత CSS ఫైలులో (లేదా HTML ఫైలులో నేరుగా CSS ద్వారా), @font-face అన్న నియమం ద్వారా ఖతిని నిర్వచించాలి. ఆపై, కావలసిన అంశాలకు ఆ ఖతిని వర్తింపజేయవచ్చు.

ధూర్జటి ఖతిని నిర్వచించడం

@font-face {

src: url(Dhurjati.ttf);

font-family: 'Dhurjati';

}

@font-face అన్న నియమంలో src లక్షణానికి విలువగా మనం నర్వరులోనికి ఎక్కించిన ఖతి యొక్క చిరునామాని url() రూపంలో ఇవ్వాలి. మనం ఎక్కించిన ఖతి CSS ఫైలు ఉన్న సంచయం (ఫోల్డరు) లోనే ఉంటే, కేవలం ఖతి యొక్క ఫైలు పేరు ఇస్తే సరిపోతుంది. లేదా పూర్తి URL కూడా ఇవ్వవచ్చు. వేరే సర్వర్లలో (డొమైన్లలో) ఉన్న ఖతులను మనం ఉపయోగించుకోడానికి మామూలుగా అయితే వీలుండదు. ఆయా సర్వర్లలో ఖతులను ఎవరైనా ఉపయోగించుకునే విధంగా Access-Control-Allow-Origin అనే HTTP headerను పేర్కొనాల్సి ఉంటుంది. గూగుల్ జాల ఖతుల వంటి ప్రజా సేవా గూళ్ళు వారి ఖతులను అందరూ వాడుకొనేలా ఇలా పేర్కొంటాయి.

మూలాలు

మార్చు
  1. "Fonts". Archived from the original on 2019-08-29. Retrieved 2019-08-29.
  2. "Telugu Fonts(తెలుగు యూనీకోడ్ ఫాంట్లు)". telugufonts.in. Archived from the original on 2020-08-05. Retrieved 2020-08-30.
  3. "Dhurjati". గూగుల్ ఫాంట్స్.