ధ్యానలింగ యోగాలయం
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ధ్యాన లింగ టెంపుల్ 1994 సంవత్సరం లో వేల్లియన్ గిరి లో సద్గురు స్థాపించారు. అదే సంవత్సరం లో ఈ టెంపుల్ సద్గురు చే మొట్ట సారిగా ధ్యానలింగ అనే భావన మొదటి ప్రోగ్రాం గా చర్చించబడింది. 1996 లో ధ్యాన లింగ టెంపుల్ వద్ద లింగం ప్రతిష్టించారు. 1999 వరకూ ఈ టెంపుల్ సద్గురు శిష్యులకు మాత్రమే ప్రవేశ అనుమతి వుండేది. 1999 నవంబర్ 23 నుండి ఈ టెంపుల్ ప్రవేశాన్ని పబ్లిక్ కు అనుమతించారు.తమ జీవితాలలో ఒత్తిడి, ఆందోళన తగ్గించు కోవాలనుకునే వారి లో ఈ టెంపుల్ ప్రాముఖ్యత పొందింది. ప్రశాంత ధ్యానానికి ఈ టెంపుల్ కు అనేక మంది వస్తారు. ఈ టెంపుల్ లోకి అన్ని మతాల వారికి ప్రవేశం కలదు.లయకారుని సన్నిధిలో జాగరణ ఈషా యోగా కేంద్రంలో ముక్కంటి రాత్రి గడపటం, అందునా సద్గురు సన్నిధిలో మహా అదృష్టంగా భావించాలి. శివరాత్రికి వారం రోజుల ముందు నుంచే వెళ్లయాంగిరి పర్వత శ్రేణులకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీ పంలోని ఈషాయోగా కేంద్రంలో అలర్ మల్ వల్లి భరతనాట్యం, పండిట్ చన్నూ లాల్ మిశ్రా హిందూస్థానీ ఓకల్, శుభా ముడ్గల్, రవి కిరణ్, తరుణ్ భట్టాచార్య సంతూర్, ఎల్. సుబ్రహ్మణ్యం వాయి లిన్, నైవేలీ సంతాన గోపాలన్ ఓకల్, అవ్జూద్ ఆలీఖాన్ సంతూర్‌లతో సంగీత రసికులను అలరిస్తారు. సద్గురు జగ్గీవాసు దవ్ పర్యవేక్షణలో ఫిబ్రవరి 18 వరకూ మహాభారత్ నాటక ప్రదర్శన వుంటుంది. మహాశివరాత్రినాడు పంచభూత ఆరాధన, ధ్యానలింగ ఆలయంలో గురు పూజ, లింగభైరవికి ప్రత్యేక అభిషేకాలు వుంటాయి. అంతేకా ఆ రోజు ధ్రుపద్ కళాకారుడు ఉస్తాద్ వసిఫుద్దీన్ దాగర్, హరిహరన్, వెస్లీ లెవీస్‌తో (కలోనియల్ కజిన్స్)తో ఫ్యూజన్ మ్యూజిక్ పాప్, సూఫీ జానపద ఓకలిస్ట్ కైలాష్ ఖేర్ గానా లాపనతో భక్తులను పారవశ్యంలో ముం చెత్తుతారు.
ధ్యాన లింగం- ఇక్కడ ధ్యానలింగం 13 అడుగుల తొమ్మిది అంగుళాలు వుం టుంది. సద్గురు 19 99లో ఈ పాదరస లిం గానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి అతిపెద్ద పాదరసలిం గాన్ని ఎవ రూ ఆవిష్క రించలేదు. ఇక్కడ ధ్యానం చేసు కోవటానికి అనేక దేశ, విదేశాల నుండి భక్తులు తరలివ స్తారు. కొద్ది సేపు ఇక్కడ ధ్యానం ఆచరిస్తేచాలు దివ్యానుభూతి లభిస్తుంది.
ఆ దివ్య సన్నిధికి మార్గం- ఈశా యోగా కేంద్రం తమిళనాడులోని కోయంబ త్తూర్‌కు సమీపంలో 30 కిలోమీటర్ల దూరంలో వెళ్లయాంగిరి సానువుల్లో వుంది. ఇక్కడ వసతి సౌకర్యాల కోసం ముందే సంప్రదించాలి. వివరములకు పశఠశఠుశసశషఠసఅఠశౌుషndశ షుn.ుసగ, 09884366340, 0978 9097995 లలో సంప్రదించగలరు. అక్కడ శివరాత్రి సందం ్భంగా ప్రత్యేక ప్యాకేజీల కోసం ముందే భక్తులు ఏర్పాట్లు చేసుకోవడం మంచింది.
తీర్థకుండ్---- వెళ్లయాంగిరిలో ఆదియోగి ఆలయం, తీర్థకుండ్ పనులు శరవేగంగా జరుగుచు న్నాయి. తీర్థకుండ్ నిర్మాణానికి 50 టన్నుల బ్లాకులను, 50 టన్నుల ఇటు కలను వాడుచున్నారు. దేశంలో మరెక్క డాలేని విధంగా నిర్మాణం సాగుతుంది. సద్గురు, ఇక్కడ నిర్మాణాలకు కాంక్రీట్ ఉపయోగించరు. ఈషాయోగ సాధకుడు సిక్కిమ్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. టన్నల్స్32 కిలోమీటర్ల వరకు ఉంటాయి. అక్కడ పవర్ హౌస్‌లో భైరవికి నెలకొల్పారు. హైదరాబాద్‌లో ఈషా క్రియా వారోత్సవాలు- నవంబర్‌లో సద్గురురాక సందర్భాన ఈషా క్రియాయోగ తరగతు లలో 400 మంది పాల్గొన్నవారు. కార్పొ రేట్ కార్యాలయాలు, పార్క్‌లు, దేవాల యాలు, ఎయిర్ పోర్ట్ తదితర ప్రముఖ కేంద్రాలలో డివిడిలు పంపిణీ జరిగింది. ఈషా క్రియావెబ్ గ్రూప్ ద్వారా, మెయిల్, అపిడేట్స్ కార్యకర్తలకు పంపిం చారు. ఓ కంపెనీ అధినేత తన 70 ఎక రాల స్థలంలో 300 మందికి క్రియా శిక్ష ణకు రావడం ముదావహం. జిఎమ్ ఆర్, అపోలో హాస్పిటల్స్, భెల్, బిపిసి ఎల్, క్రాస్ వర్డ్, హెల్త్ అండ్ గ్లో తదితర సంస్థలు ఈషాయోగా నిర్వహణకు ముందుకు వచ్చాయి.
ఆదియోగి ఆలయం- ఆధ్యాత్మిక భావ జాల వ్యాప్తికి 82,000 చదరపుగజాల స్థలంలో ఆదియోగి ఆలయానికి డిసెంబర్ 23న అంకురార్పణ జరిగింది. వ్యక్తిగతంగా సాధనలో అంతర్ యాత్రకు ఈ ఆల యం ఉపకరిస్తుంది.
ఈషా ఆరోగ్య- సనాతనం, నిత్యనూతనానికి ప్రతీకగా, సుశ్రుత, చరక సిద్ధవైద్యులను ఆదర్శంగా తీసుకొని ఈషా ఆరోగ్య కేం ద్రాన్ని తమిళనాడులోని సేలంలో నిర్వహిస్తున్నారు. ఒకే ప్రాంగ ణంలో అల్లోపతి, సిద్ధ, ఆయుర్వేద, నేచురోపతి విధానాల ద్వారా చికిత్స చేస్తారు. మున్ముందు ఆయుర్ రసాయన, ఆయుర్ సంపూర్ణ, యోగ మార్గ, ఈషా రెజువనేషన్ కేంద్రాలను ప్రారంభిస్తారు. దేశంలో వివిధ ప్రాంతాలలో వీటిని నిర్వహించే యోచనలో వున్నారు. అవినీతికి వ్యతిరేకంగా- సద్గురు జగ్గీవాసుదేవ్ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజరేను ఆగస్టు 22, 2011న ఢిల్లిdలోని రామ్‌లీలా మైదానంలో కలిసి వారికి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో సహకారం అందజేశారు. కోయంబత్తూర్‌లో అవి నీతి వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించారు. దేశభక్తిపాటలు, ప్రముఖ కేరళ యుద్ధ క్రీడ కళరిపాయట్టు ప్రముఖ ఆకర్షణగా నిలిచాయి. సద్గురు ఏమంటారంటే, అవినీతి జాతికే ఓ చీడ పురుగు. అన్నా ఉద్యమం భారతీయుల హృదయాలను తట్టిలే పింది. చిత్రమేమంటే ప్రభుత్వం అవినీతిపరులను శిక్షించే బదు లు, అవినీతి వ్యతిరేక ఉద్యమాలను అణచివేయ చూస్తుంది. ఈ ఉద్యమంతో అవినీతి ఒక్కపాటున అంతరించదు. అయితే అవి నీతి జీవన స్రవంతిలో ఓ భాగమనే దానికి దూరంగా వుంటా రు. అన్నా ఉద్యమానికి రాజకీయ రంగు పులమకూడదు. అవి నీతిని అంతమొందించటానికి కఠిన చట్టాలు అవసరం. అవినీతి మహా ఘోరం అంటూ ఓ ముద్ర పడేస్తేనే సరిపోదు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో భాగంగా అవినీతిని అంత మొందించాలి. ప్రజాస్వామ్యం అంటే ఐదు సంవత్సరాలకు జరిగే ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడమే కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనాలి. ప్రజలకు బంద్‌లు, హర్తాళ్లు నిర్వహించి జీవనాన్ని స్థంభించడం తెలుసు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకొని దేశాన్ని సక్రమంగా నడపటం తెలుసుకోవాలి.
లింగభైరవి- సద్గురు, లింగభైరవి యంత్ర లేక లింగ భైరవి అవిఘ్నయంత్రములను నవంబర్ 23న కేంద్రంలో ఆవిష్కరిం చారు. ఎవరైతే విశ్వాసంతో, అనన్యభక్తితో లింగ భైరవి యం త్రాన్ని ఆరాధిస్తారో వారికి భైరవీమాత అను గ్రహం తప్పక లభిస్తుంది. వారు అపజయం, మరణం, బీదరికం నుండి సంరక్షింప బడతారు. ఆ దివ్యమాత అనుగ్రహాన్ని పొందటానికి నిశ్చల భక్తితో ఆరాధించాలి.
ఈషా ఫౌండేషన్- సద్గురు నిర్వహించే ఈషా ఫౌండేషన్‌కు కన్సల్టేటివ్ స్టేటస్‌ను ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కల్పించింది. ఈ సంస్థకు 200 కేంద్రాలు ప్రపంచ వ్యాప్తంగా వున్నాయి. సద్గురు అవిరళ కృషిని ప్రపంచ సంస్థలు గుర్తించాయి. యునై టడ్ నేషన్స్ మిల్లేనియమ్ పీస్ సమ్మిట్, ఆస్ట్రేలియన్ లీడర్ షిప్‌రిట్రీట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లు గుర్తించాయి. ఈషా యోగాలో ధ్యాన ముద్రలు సులభశైలిలో వుంటాయి. ఇవి ఆధ్యా త్మిక ఉన్నతికి సహకరిస్తాయి. శాంభవీ మహా ముద్ర సాధనలో వ్యక్తి గతంగా చక్కటి ఆరోగ్యం సిద్ధించటమే కాకుండా, నిత్య జీవితంలో అలసట లేని జీవనాన్ని గడపగలరు.
హఠయోగ- ఈ యోగను మూడు రోజులు నేర్పుతారు. సూర్య నమస్కారాలు దీనిలో ఓ భాగం, కొన్ని ఆసనా లను నేర్పుతారు. శారీరక, మానసిక వికాసానికి తోడ్పడతాయి. భావ స్పందన- ఆధ్యా త్మిక ఉన్నత స్థానాని కి ఈ కార్యక్రమం ఉపకరి స్తుంది. అమి తానం దం, కారుణ్యం వంటి సద్గు ణాలను అలవరచు కుంటారు.
శూన్య యోగం- ఇన్నర్ ఇంజనీరింగ్ చేసిన వారికి శూన్య యోగ పద్ధతు లను నేర్పు తారు. శక్తి చలన క్రియలు, ప్రాణాయా మం ద్వారా మరింత 'ఎనర్జీ' పొందుతారు. సంయమ - ఈయోగ క్రియను ఏడు రోజులపాటు నిర్వహిస్తారు. మౌనంతో, ఎన్నోగం టలు ధ్యానంలో గడపాలి. కేవలం సీనియ ర్స్‌కే 'సంయమ'ను నేర్పుతారు. సద్గురు పర్యవేక్షణలో శిక్షణ వుంటుంది. ఈషాయోగ సారధ్యంలో గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఈషా విద్య, ఈషాహోమ్ స్కూల్, ఈషా క్రాఫ్ట్, ఈషా పబ్లికేషన్స్ నిర్వహిస్తున్నారు. సద్గురు పర్యవేక్షణలో కొన్నివేల మంది యువకులు ఆధ్యాత్మిక వికాసానికి కృషి చేస్తున్నారు. - దండు కృష్ణవర్మ
చిత్ర మాలిక
మార్చు-
Inside the Dhyanalinga temple
-
Ellipsoidal dome with linga in the top
-
Sarva Dharma Sthamba at the entrance
-
Nandhi outside the entrance