శబ్దం అనేది కంపించే వస్తువు నుండి వెలువడుతుంది. ఈ తరంగాలు ప్రయాణీంచుటకు స్థితిస్థాపకత, జడత్వం గల యానకం అవసరం. ఈ తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు. ఈ తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు.

ధ్వని తరంగాలు

ధ్వని విస్తరణ మార్చు

ధ్వని స్థితి స్థాపకత, జడత్వం గలిగిన యానకంలో ప్రయాణిస్తుంది. అనగా ఘన, ద్రవ, వాయు పదార్థాలలో ప్రయాణిస్తుంది.ఒక కణం సెకనుకు చేసే కంపనాలను పౌనఃపున్యము అంటారు. దీనికి ప్రమాణం హెర్ట్స్. మానవుడు శ్రవ్య అవధి 20 Hz to 20,000 Hz. వరుకు ఉంటుంది. ఉదాహరణకు ఆకులు కదిలినపుడు, పచ్చగడ్డి కదిలినపుడు కూడా శబ్దం వెలువడుతుంది. కాని ఆ శబ్దం మనకు వినబడదు. ఎందువనంటే వాటి పౌనః పున్యం 20 హెర్ట్స్ కన్నా తక్కువ ఉంటుంది. అదే విధంగా అంతరిక్షంలో జరిగిన పెద్దశబ్దాలను కూడా మనం వినలేము. ఎందువలనంటే ఆ శబ్దాలు 20000హెర్ట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. కాని కుక్క ల శ్రవ్య అవధి 40 Hz to 60,000 Hz కావున ఆ శబ్దాలను వినగలవు. అందువలన అవి ఆకాశం వైపు చూసి అరుస్తుంటాయి. ఈ తరంగాలు పరావర్తనం చెందగలవు. ఈ తరంగాలు ఏదైనా అవరోధాలను తాకినపుడు వెళ్ళీన మార్గం లోనే తిరిగి వస్తాయి. అవుడు ప్రతిధ్వని వస్తుంది. ఉదాహనణకు ఏదైనా యింటిలో సామాన్లు ఏవీ లెనపుడు మాట్లాడితే పెద్ద శబ్దాలు వినబడతాయి. దీనికి కారణం మన శబ్దాలు గోడలను తాకి క్రమ పరావర్తనం చెందుతాయి. అపుడు ప్రతిధ్వని వినబడుటయే. అదే యింటిలో సామాన్లు ఉన్నపుడు అంతగా ప్రతిధ్వని రాదు. దీనికి కారణం అక్రమ పరావర్తనం చెందటమే. ధ్వని తరంగాలు ఏవైనా అవరోధాలను తాకినపుడు వంగి ప్రయాణిస్తాయి. ఈ ధర్మమును వివర్తనము అంటారు.

డాప్లర్ ఫలితము మార్చు