నందగిరి వెంకటరావు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నందగిరి వెంకటరావు( 1909-1985) తెలంగాణ తొలితరం తెలంగాణ కథకుల్లో అగ్రగణ్యుడు. గిరి అనే కలంతో అనేక కథలు రాశారు. 1935లోనే ప్రథమ అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని హైద్రాబాద్ లో నిర్వహించారు. ఆంద్రమహాసభ నాయకుడిగా, తెలంగాణ సాయుధపోరాటకాలంలో జైలుకెళ్ళిన స్వాతంత్ర్య సమరయోధుడిగా, జడ్జ్ గా, గ్రంథాలయోద్యమకారునిగా, స్త్రీవిద్య ప్రచారకుడిగా నందగిరి సేవలు చిరస్మరణీయమైనవి.
ప్రతిఫలం, నూర్జహాన్, తప్పేమి?, జరిగిన కథ..లాంటి కథల్లో హైద్రాబాద్ తెహజీబ్ ను తెలియజెప్పారు. ఈయన రాసిన సితార, చలం రాసిన ఓ పువ్వు పూసింది కంటే మిన్నగా ఉందని విమర్శకుల అభిప్రాయం. పటేలు గారి ప్రతాపం పేరుతో తెలంగాణ సాయుధపోరాటానికి 15 ఏళ్ళ ముందే స్పూర్తినినింపే కథను రచించారు. ఈయన రచించిన ఇతర కథలు హుస్సేన్ బీ, కామాక్షి కథలు.
నందగిరి ఇందిరా దేవి ఇతని భార్య.