నందప్రయాగ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

నందప్రయాగ
నందప్రయాగ is located in Uttarakhand
నందప్రయాగ
నందప్రయాగ
Location within Uttarakhand
భౌగోళికాంశాలు :30°20′N 79°20′E / 30.33°N 79.33°E / 30.33; 79.33
ప్రదేశం
దేశం:భారత దేశము
ప్రదేశం:హిమవత్పర్వతము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పరమ పురుషన్
ప్రధాన దేవత:పరిమళ వల్లి
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:గోవర్ధన-ఇంద్ర తీర్థములు, మానస సరస్సు
విమానం:గోవర్ధన విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:పార్వతీదేవికి

విశేషాలు మార్చు

జోషీమఠ్‌నే తిరుప్పిరిది యందురు. ఈ క్షేత్రము దేవప్రయాగ నుండి 170 కి.మీ. దూరములో నున్నది. మధ్యలో గల నందప్రయాగలో విష్ణుగంగ మందాకినీ నదులు సంగమిస్తున్నాయి. అక్కడ నందగోపులు, యశోద కణ్ణన్ సన్నిధులు ఉన్నాయి.

కుబేరుడు తపమాచరించిన ప్రదేశమే తిరుప్పిరిది. ఇచట ఆది శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడినట్లుగా ప్రసిద్దమైన నృసింహస్వామి సన్నిధి, వాసుదేవుల సన్నిధి ఉన్నాయి. వాసుదేవులు నిలుచిన భంగిమలో ఉన్నాడు. వీరిని ఆళ్వార్లు కీర్తించినట్లుగా భావిస్తున్నారు.

ఈ జోషిమఠ్ సమీపముననే విష్ణుప్రయాగ ఉంది. అక్కడ నారదునిచే ప్రతిష్ఠింపబడిన సన్నిధి ఉంది. దీనికి సమీపముననే పాండుకేశ్వరం ఉంది. బదరీ సన్నిధి మూసిన తరువాత ఉత్సవమూర్తులను ఈ పాండికేశ్వరంలో ఉంది. వాసుదేవుల సన్నిధిలో నుంచి పూజిస్తారు ఈ పాండికేశ్వరానికి 25 కి.మీ. దూరమున బదరికాశ్రమం ఉంది.

సాహిత్యం మార్చు

శ్లో. పరిమళ లతికాఖ్యాం నాయకీం వీక్షమాణ
   పరమ పురుషనామా భోగి భోగే శయాన:|
   కలిరిపు మునికీర్త్య: పార్వతీగోచరాంగో
   హిమవతి గిరిరాజే రాజతే ప్రాజ్ముఖాఖ్య:||
   గోవర్దనేంద్ర తీర్థాడ్యే తిరుప్పిరిది పట్టణే|
   మానసాఖ్య సరస్తీరే గోవర్ధన విమానగ:||

పాశురాలు మార్చు

పా. వాలి మాపలత్తొరుపనదుడల్; కెడవరి శిలై వళై విత్తన్ఱు;
   ఏలనాఱు తణ్డడమ్‌ పొழிలిడమ్బెఱ; విరున్ద నల్లిమయత్తుళ్
   ఆలిమా ముగిలదిర్ దరవరువరై: యగడుఱ ముగడేఱి;
   పీలిమామయిల్ నడ--యుమ్; తడ--వై ప్పిరిది శెన్ఱడైనె--
        తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 1-2-1

వివరాలు మార్చు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ ప్రదేశం కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
పరమ పురుషన్ పరిమళ వల్లి గోవర్ధన-ఇంద్ర తీర్థములు. మానస సరస్సు తూర్పు ముఖము భుజంగ శయనము హిమవత్పర్వతము తిరుమంగై ఆళ్వార్ గోవర్ధన విమానము పార్వతీదేవికి

చేరే మార్గం మార్చు

దేవప్రయాగ నుండి 170 కి.మీ

చిత్రమాలిక మార్చు

ఇవికూడా చూడండి మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు