నందితా బెర్రీ -

నందితా వెంకటేశ్వరన్ బెర్రీ
109వ టెక్సాస్ రాష్ట్ర కార్యదర్శి
In office
2014 జనవరి 7 – 2015 జనవరి 20
గవర్నర్రిక్ పెర్రీ
అంతకు ముందు వారుజాన్ స్టీన్
తరువాత వారుకార్లోస్ కాస్కోస్
వ్యక్తిగత వివరాలు
జననం (1968-04-14) 1968 ఏప్రిల్ 14 (వయసు 56)
హైదరాబాదు, భారతదేశం
రాజకీయ పార్టీరిపబ్లికన్ పార్టీ
జీవిత భాగస్వామిమైఖేల్ బెర్రీ (రేడియో హోస్ట్)
సంతానంఇద్దరు కొడుకులు
నివాసంహ్యూస్టన్, టెక్సాస్, USA
కళాశాలమౌంట్ కార్మెల్ కాలేజ్, బెంగళూరు
యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ (BA, JD)
వృత్తిన్యాయవాది

భారత సంతతికి చెందిన న్యాయవాది. ఆమె పూర్తిపేరు నందితా వెంకటేశ్వరన్ బెర్రీ అమెరికాలోని టెక్సాస్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఎంపికయ్యారు. భారత్ కు చెందిన తొలి మహిళగా టాప్ మూడో ఎక్స్ క్యూటివ్ గా నందితా ఈ పదవికి ఎంపికయ్యారు.

ఆ దేశ గవర్నర్ రిక్ పెర్రీ ఆమెను ఈ పదవికి ఎంపిక చేశారు. నందితా కష్టపడే తత్వం కలిగి, అంకితాభావంతో పనిచేసేవారని గవర్నర్ రిక్ పెర్రీ ఈ సందర్భంగా ఆమెను కొనియాడారు. హ్యూస్టన్ లో న్యాయవాది వృత్తిలో నైపుణ్యం సాధించిన నందితా 109వ టెక్సాస్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా 2014 జనవరి 7 నుంచి పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అంతేకాకుండా ఆమె టెక్సాస్ రాష్ట్రానికి ప్రధాన ఎన్నికల అధికారిగానూ, ప్రోటోకాల్ ప్రధాన అధికారిగానూ, మెక్సికో వ్యవహారలపై, అంతర్జాతీయ వ్యవహారాలపై పర్యవేక్షించనున్నారు. నందితా హ్యూస్టన్ జూ, సౌత్ ఏసియన్ చాంబర్ ఆఫ్ కాన్ఫరెన్స్, హ్యూస్టన్ ఏరియా ఉమెన్స్ సెంటర్, హ్యూస్టన్ కమ్యూనిటీ ఫ్యామిలీ సెంటర్ వంటి సంస్థలకు ఆమె సేవలు అందించారు. నందితా తన 21వ ఏటా హ్యూస్టన్ లో అడుగుపెట్టారు. 200 డాలర్ల సంపాదనతో లా డిగ్రీ పూర్తిచేసిన నందితా, హ్యూస్టన్ లో నైపుణ్యం కలిగిన న్యాయవాదులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.

1968లో హైదరాబాద్ లో జన్మించిన నందితా వెంకటేశ్వరన్ బెర్రీ, హ్యూస్టన్ కు చెందిన మిచెల్ బెర్రీని పెండ్లి చేసుకున్నారు. నందితా కర్ణాటక లోని బెంగళూరులో ఎమ్ టీ. కార్మెల్ కాలేజీలో బీఏ చదివారు. ఆ తరువాత అమెరికా వచ్చి బెర్రీ హ్యూస్టన్ లోని యూనివర్సిటీలో పోలిటీకల్ సైన్స్ లో మరో డిగ్రీ చేశారు. 1995లో హ్యూస్టన్ యూనివర్సిటీ లా సెంటర్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. అదే సంవత్సరంలో టెక్సాస్ బార్ కౌన్సిల్ లో చేరారు. ప్రస్తుతం నందితా బెర్రీ లా సంస్థ అయినా లోకె లార్డ్ ఎల్ఎల్పీలో సీనియర్ కౌన్సిలర్ గా ఉన్నారు.

మూలాలు

మార్చు

సాక్షి దినపత్రిక: 27.12..2013