నక్కా బాలయోగి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2017 జనవరి 17 నుండి 2019 జనవరి 14 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించాడు.[1]

నక్కా బాలయోగి

పదవీ కాలం
2017 జనవరి 17 – 2019 జనవరి 14

వ్యక్తిగత వివరాలు

జననం 1957 జనవరి 15
పెయ్యాలవారిపేట, ముమ్మిడివరం మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
పూర్వ విద్యార్థి ఆంధ్రా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం

మార్చు

నక్కా బాలయోగి 1957 జనవరి 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం మండలం, పెయ్యాలవారిపేట గ్రామంలో జన్మించాడు. ఆయన అమలాపురంలోని ఎస్.కే.బి.ఆర్ కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేసి, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పట్టా అందుకున్నాడు.

వృత్తి జీవితం

మార్చు

నక్కా బాలయోగి లా పూర్తి చేశాక బార్ కౌన్సిల్ లో 22 డిసెంబర్ 1980న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని సీనియర్ న్యాయవాది వీ. వెంకట రామయ్య దగ్గర జూనియర్‌గా చేరి వృత్తిలో మెళుకువలు నేర్చుకొని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టి 1985లో డిస్ట్రిక్‌ మునిసిఫ్‌ మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జిగా, సీనియర్ సివిల్ జడ్జిగా, అదనపు జిల్లా జడ్జిగా పని చేసి పదోన్నతి పై 30 జూన్ 2010న కర్నూలు జిల్లా ప్రిన్సిపాల్ & సెషన్స్ జడ్జిగా నియమితుడయ్యాడు.

నక్కా బాలయోగి 02 ఏప్రిల్ 2012 నుండి 23 నవంబర్ 2013 వరకు హైదరాబాద్ లోని ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్-I ఛైర్మన్‌గా, 23 నవంబర్ 2013 నుండి 9 జులై 2015 వరకు సిబిఐ కేసులను చూసే ప్రిన్సిపాల్ స్పెషల్ జడ్జిగా, 10 జులై 2015 to 16 జనవరి 2017 వరకు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా పని చేసి 17 జనవరి 2017న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 14 జనవరి 2019న న్యాయమూర్తిగా పదవి విరమణ చేశాడు.[2]

మూలాలు

మార్చు
  1. Sakshi (16 January 2017). "ఉమ్మడి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  2. Sakshi (12 January 2017). "హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.