నత్తం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నత్తం, భార దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
తమిళనాడు | |
---|---|
భౌగోళికాంశాలు : | 8°38′13″N 77°55′26″E / 8.63694°N 77.92389°E |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | విజయాసన పెరుమాళ్ |
ప్రధాన దేవత: | వరగుణమంగై తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖం |
పుష్కరిణి: | అగ్నితీర్థం |
విమానం: | అగ్నిహోత్రునకు |
కవులు: | నమ్మాళ్వార్ |
ప్రత్యక్షం: | విజయకోటి విమానం |
విశేషాలు
మార్చుఆకలిగొన్నవాడు అన్నము పచనమగు వరకు అచటనే నిలబడి, కూర్చుండి, పరుండి, అన్నమునకై ఎదురుచూచునట్లుగా భక్తునకు పరమ భక్తి రూపమగు పరిపక్వ దశ వచ్చు వరకు సర్వేశ్వరుడు కూడా పై విధముగా త్వరపడుచుండునట. ఆళ్వారుల విషయమై సర్వేశ్వరునకు గల ఈ "భోగ్యపాకత్వరను" ఆళ్వార్లు "పుళింగుడి" యను క్షేత్రమున శయనించి; తిరువరగుణ మంగై యను క్షేత్రమున కూర్చుండి, శ్రీవైకుంఠ క్షేత్రమున నిలబడి" యని కీర్తించారు.
సాహిత్యం
మార్చుశ్లో. శ్రీమత్యాం వరగుణమంగై నామ పుర్యాం ప్రాప్తాయాభి రుచిరం సుతీర్థమగ్నే:|
నాయక్యా వరగుణమంగై నామ సత్యా ప్రాగాస్యాసన రుచిరోగ్ని దృష్టరూప:|
విజయకోటి విమాన వరస్థిత శ్శఠరిపూత్తమ భవ్య వచ: ప్రియ:|
సుజన సేవిత పాద సరోరుహ: విజయతే ధరణౌ విజయాసన:||
పాశురాలు
మార్చుపా. పుళిజ్గుడిక్కిడన్దు వరగుణమంగై యిరన్దు; వైకున్దత్తుళ్ నిన్ఱు;
తెళిన్ద వెన్‌శిన్దై యగజ్కழிయాదే; యెన్నైయాళ్వా యెనక్కరుళి;
నళిర్‌న్ద శీరులగమ్ మూన్ఱుడన్ వియప్ప; నాజ్గళ్ కూత్తాడి నిన్ఱార్ప
పళిజ్గునీర్ ముగిలిన్ పవళమ్బోల్ కనివాయ్ శివప్ప; నీ కాణవారాయే.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-2-4
వివరాలు
మార్చుప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
విజయాసన పెరుమాళ్ | వరగుణమంగై తాయార్ | అగ్నితీర్థం | తూర్పు ముఖము | కూర్చున్న భంగిమ | నమ్మాళ్వార్ | విజయకోటి విమానం | అగ్నిహోత్రునకు |
మంచిమాట
మార్చుభక్తుడు భగవంతుని సంతోషింప చేయవలయునని ప్రయత్నించును.
భగవంతుడు ప్రపన్నులను సంతోషింప చేయ ప్రయత్నించును
సూచన
మార్చుతిరువారాధన కాలమందు పోయి సేవింపవలెను. లేకున్న అర్చక స్వాములను ముందుగా కలసి ఏర్పాటు చేసికొనవలెను.
చేరే మార్గం
మార్చుశ్రీవైకుంఠము నుండి తూర్పుగా 2 కి.మీ దూరమున గలదు. "నత్తం" అనియే చెప్పవలెను. వసతులు స్వల్పము