నఫే సింగ్ రాఠీ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు బహదూర్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నఫే సింగ్ రాఠీ

పదవీ కాలం
3 జనవరి 2020 – 25 ఫిబ్రవరి 2024

ఎమ్మెల్యే
పదవీ కాలం
1996 – 2005
ముందు సూరజ్ మాల్
తరువాత రాజిందర్ సింగ్
నియోజకవర్గం బహదూర్‌గఢ్

వ్యక్తిగత వివరాలు

మరణం 25 February 2024
ఝజ్జర్, హర్యానా
రాజకీయ పార్టీ దస్త్రం:Indian National Lok Dal Flag Official.png ఇండియన్ నేషనల్ లోక్ దళ్
ఇతర రాజకీయ పార్టీలు = సోషల్ యాక్షన్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

నఫే సింగ్ రాఠీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి బహదూర్‌ఘర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్‌గా రెండు పర్యాయాలు పని చేశాడు. ఆయన 1996 నుండి 2005 వరకు ఐఎన్ఎల్‌డీ టిక్కెట్‌పై బహదూర్‌గఢ్ నుండి ఎమ్మెల్యేగా పని చేసిన అతను తరువాత పార్టీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు.

నఫే సింగ్ రాఠీ 2014లో బహదూర్‌గఢ్‌ నుంచి ఐఎన్‌ఎల్‌డీ టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీలో చేరాడు, కానీ బీజేపీ కూడా ఆయనకు టికెట్ నిరాకరించడంతో స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయి తిరిగి 2018లో ఐఎన్‌ఎల్‌డీ పార్టీలో చేరాడు. ఆయన 2019లో బహదూర్‌ఘర్ నియోజకవర్గం నుండి ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. నఫే సింగ్ రాఠీ 2020లో ఐఎన్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

నఫే సింగ్ రాథీ హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో బహదూర్‌గఢ్‌లోని బరాహి గేట్ సమీపంలో హ్యుందాయ్ ఐ10లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు 2024 ఫిబ్రవరి 25న ఆయన ప్రయాణిస్తున్న కారుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. నఫే సింగ్ రాఠీ ఘటన స్థలంలోనే మరణించాడు.[1][2][3]

మూలాలు

మార్చు
  1. Mana Telangana (25 February 2024). "హర్యానాలో దారుణం.. ఐఎన్‌డిఎల్ నేత రాథే హత్య". Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
  2. TV9 Telugu (25 February 2024). "ఇండియన్ నేషనల్ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ దారుణ హత్య". Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Indian Express (25 February 2024). "Who was Nafe Singh Rathee, the Haryana INLD chief shot dead in Jhajjar?" (in ఇంగ్లీష్). Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.