నరకం
ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలు చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెపుతున్నాయి. ఈ విధమైన బోగదేహం రెండు రకాలు. ఒకటి సూక్ష్మ దేహం ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్ధ్వలోకాలకు చేరుతుంది. రెండవది యాతనా దేహం . ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరకాది లోకాలకు చేరుతుంది. మృత్యువు తరువాత వెంటనే కొత్త దేహం ధరించటం వీలుకాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి మనోమయ ప్రాణమయ దేహంచేత, సుకృత, దుష్కృత సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది.

నరకాలలో రకాలు సవరించు
హిందువుల నరకం సవరించు
మహాభాగవతంలో యాతనా దేహం అనుభవించే వివిధ నరకశిక్షలు వాటిని అమలుచేసే 28 నరకాల వర్ణన ఉంది.
- అంధతామిస్ర నరకం:
- రౌరవము :
- మహా రౌరవము :
- కుంభీపాక నరకం:
- కాలసూత్ర నరకం:
- అసిపత్ర వనము:
- సూకర ముఖము:
- అంధకూపము:
- క్రిమి భోజనం:
- నందశన:
- తప్తసూర్మి:
- వజ్రకంటక శాల్మలి:
- వైతరణి :
- పూయాదన:
- ప్రాణరోధ:
- వైశాన:
- లాలాభక్ష:
- సారమేయోదనము:
- అవిచి మంత:
- అయపానము:
- క్షారకర్దమ:
- రక్షో గణబోధన:
- శూల ప్రోతము:
- దండసూకర:
- అవధినిరోధన:
- పర్యావర్తన:
- సూచిముఖి:
క్రైస్తవుల నరకం సవరించు
అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు.ఏడుపు పళ్ళుకొరుక్కోటం ఉంటాయి.
ముస్లిముల నరకం సవరించు
ఏడు ద్వారాలుంటాయి.త్రాగటానికి సలసల కాగే నీరూ చీమూ నెత్తురూ ఇవ్వబడతాయి.అదిశుద్ధిచేసే అగ్నిగుండం హృదయాలను దహించే అగ్ని జ్వాల. ఈ నరకంలో కాఫిర్ (నాస్తికులు) ని పొయ్యిలో పెట్టి వంట చెరుకుగా ఉపయోగిస్తారు. వీళ్ళ నరకం ప్రకారం కూడా నరకానికి మాలిక్ (రాజు) ఉంటాడు. దేవ దూతలు చనిపోయిన మనిషి సమాధి దగ్గరకి వచ్చి అతని పాప పుణ్యాలు విచారించి, అతను పాపి లేదా నాస్తికుడు లేదా దేవున్ని నమ్ముతున్నట్టు నటించినవాడు అయితే అతన్ని నరకానికి తీసుకుపోతారు.
గ్రీక్ పురాణాలలో నరకం సవరించు
గ్రీక్ పురాణాల ప్రకారం ప్లూటో నరకానికి రాజు.