నలుడు

హిందూ పురాణాలలోని ఒక పాత్ర. నల దమయంతి కథ కథానాయకుడు,

1. యదువు మూఁడవ కొడుకు. 2. యయాతి పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు. 3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య దమయంతి. కొడుకు ఇంద్రసేనుఁడు. కూఁతురు ఇంద్రసేన. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని కలిపురుషుఁడు వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను. 4.విశ్వకర్మవలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతఁడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.

"https://te.wikipedia.org/w/index.php?title=నలుడు&oldid=2949086" నుండి వెలికితీశారు