నల్లంచిపిట్ట
ఇంగ్లీషులో దీనిని డ్రాంగో, కింగ్ డ్రాంగో అంటారు. కాటుకరంగు నలుపు, వంటిమీద నీలం రంగు మెరుపు, తోక v ఆకృతిలో కత్తిరించినట్లు ఉంటుంది. కారు నలుపు కనుక తెలుగులో నల్లంచి ఆంటారేమో! విజయనగరం ప్రాంతంలో దీనిని 'మంగలికత్తెరపిట్ట' అంటారు . డింభకాలు చాయవెలిసిన రాగిరంగులో, బ్రౌన్ వర్ణంలో కనిపిస్తాయి. పెద్దగా ఈల వేసినట్లు "వీ టీ హీ" అని అరుస్తాయి. ఈ పిట్ట మన దేశమంతటా సముద్ర మట్టానికి 1500 ఆడుగుల ఎత్తుకు మించని వ్యవసాయ పొలాలు, పట్టణ ప్రాంతాలు, నిర్మూలమయిన అటవీ ప్రాంతాలలో కనిపిస్తుంది. అడవుల్లో కనిపించవు. దీని శాస్త్రీయ నామం Dicrus macrocercus, Family;dicruride^Passeriforms^Aves^chordata^ annimahia.
Black drongo | |
---|---|
Scientific classification | |
Unrecognized taxon (fix): | Dicrurus |
Species: | Template:Taxonomy/DicrurusD. macrocercus
|
Binomial name | |
Template:Taxonomy/DicrurusDicrurus macrocercus (Vieillot, 1817)
| |
Subspecies | |
D. m. macrocercus (Vieillot, 1817)[2] | |
Approximate range
Breeding visitor Present year-round Winter visitor only | |
Synonyms | |
Buchanga atra |
ఆహారపు అలవాట్లు: నల్లంచిపిట్టలు కీటకాలను, పురుగులను, చీమలను, బల్లులను, తూనీగలను, మిడతలు, గొల్లభామలు, పిచుకల వంటి చిన్న పిట్టలను పట్టి తింటాయి. తేనెటీగలను భక్షిస్తాయి కనుక తేనే పట్టులను పెంచే పరిశ్రలవారికి కష్టం, నష్టం కలిగిస్తాయి. ఆహారాన్ని వేటాడి సంపాదిస్తాయి. తమకన్నా చాల పెద్ద పక్షులను కుడా ఎదుర్కొని తరిమి తరిమి కొడతాయి. పొలాల్లో మేసే పశువుల వెంట ఉండి, వాటి కదలికలవల్ల పయికి ఎగిరిన మిడతలు, ఇతర కీటకాలను వేటాడుతుంది. అందుకే పసువులమీద వాలి ఉంటాయి. ఇతర దేశాల్లో నల్లంచిపిట్టలు శీతాకాలంలో వలసలు పోతాయి. భారతదేశంలో ఈ పిట్టలు వలస వెళ్ళవు. ఇవి ఏటా మార్చి, ఆగస్టు మధ్య గూళ్ళుకట్టి పిల్లలను చేస్తాయి. చెట్ల కొమ్మలుచీలి పంగాలు ఏర్టడినచోట పీచు, నారతో చిన్న కప్పు ఆకారంలో గూడు అల్లి మూడు నాలుగు గుడ్లు పెడతాయి. తెల్లని గుడ్లమీద నల్లని మచ్చలు ఉంటాయి. తమ గూళ్ళు కట్టుకున్న ప్రదేశాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఆ సమీపానికి వేరే పక్షులు, జంతువులూ రాకుండా తరుముతాయి. అందుకే కొన్ని పక్షులు నల్లంచి నివాసం ఉన్నచోట తమ గూళ్ళు కట్టుకొంటాయి. నల్లంచిపిట్ట పిల్లలు పెద్దవి అయి, ఆ ప్రాంతాల్లోనే వేరు నివాసాలు ఏర్పాటు చేసుకొంటాయి. ఆధ్యాత్మిక పరిభాషలో drango ధయిర్యం, సాహసం, ఆత్మరక్షణ చేసుకొనే గుణం, వినోదంగా గడపడం, ఆధ్యాత్మికత, విశ్వాసం, నమ్మకం ఆత్మీయులను ప్రేమించడం వంటి లక్షణాలను సూచిస్తుంది. ఇందులో కొన్ని లక్షణాలు నల్లంచిపిట్టకున్నాయి.
మూలాలు
మార్చుThe CITES (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) status is ‘Not Evaluated’ for the black drongo (Dicrurus macrocercus). Taxonomy and scientific classification of Dicrurus macrocercus Kingdom: Animalia Phylum: Chordata Class: Aves Order: Passeriformes Family: Dicruridae Subfamily: - Genus: Dicrurus Species: D. macrocercus Binomial name: Dicrurus macrocercus IUCN status listing: Least Concern The black drongo (Dicrurus macrocercus) is closely related to the fork-tailed drongo or African drongo (Dicrurus adsimilis). The black drongo was earlier considered conspecific with the fork-tailed drongo.
The seven recognized subspecies of the black drongo are: D. m. macrocercus Vieillot, 1817, D. m. albirictus (Hodgson, 1836), D. m. javanus Kloss, 1921, D. m. harterti E. C. S. Baker, 1918, D. m. thai Kloss, 1921, D. m. cathoecus Swinhoe, 1871 and D. m. cathoecus Swinhoe, 1871. Popular posts on Birds of India
- ↑ BirdLife International (2016). Dicrurus macrocercus. The IUCN Red List of Threatened Species 2016. doi:10.2305/IUCN.UK.2016-3.RLTS.T22706961A94099367.en
- ↑ Vieillot, Louis Jean Pierre (1817). Nouveau Dictionnaire d'Histoire Naturelle Appliquée aux Arts. Vol. 9. Chez Deterville. p. 588.
- ↑ Hodgson, Brian Houghton (1836). "On some new species of the Edolian and Ceblepyrine subfamilies of the Laniidae of Nepal". The India Review and Journal of Foreign Science and the Arts. 1 (8): 324–329.
- ↑ Blyth, Edward (1850). "Remarks on the modes of variation of nearly affined species or races of Birds, chiefly inhabitants of India". The Journal of the Asiatic Society of Bengal. 19: 221–239.
- ↑ Swinhoe, Robert (1871). "A revised catalogue of the birds of China and its islands, with descriptions of new species, references to former notes, and occasional remarks". Proceedings of the Zoological Society of London. 2: 337–423.
- ↑ 6.0 6.1 Kloss, Cecil Boden (1921). "New and known oriental birds". Journal of the Federated Malay States Museums. 10 (2): 207–213.
- ↑ Baker, Edward Charles Stuart (1918). "Some Notes on the Dicruridae". Novitates Zoologicae. 25: 299.
- ↑ Neave, Sheffield A., ed. (1939). Nomenclator Zoologicus; a List of the Names of Genera and Subgenera in Zoology from the Tenth Edition of Linnaeus, 1758, to the End of 1935 (with supplements). Volume 1. Zoological Society of London, London. p. 425.