భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ప్రతి ఏటా దేశ పురోగతిని, సమస్యలను వివరిస్తూ వెలువడిన పత్రిక నవభారతం. ప్రతీ స్వాతంత్ర్య దినోత్సవానికి ఈ పత్రిక వెలువడేది. దీనికి సంపాదకులు సీతంరాజు సుబ్రహ్మణ్యశర్మ.

హైదరాబాదు

భారత ప్రజా ప్రభుత్వపు తొలి సంవత్సర కార్యకలాపాలను సమీక్షిస్తూ "నవభారతం 1947-48" ను ప్రచురించారు. ఇది పాఠకాదరణ పొందింది. ప్రతీ సంవత్సరం భారత ప్రభుత్వ కార్యకలాపాలను సమీక్షిస్తూ ఈ పత్రిక వెలువడేది.

ప్రభుత్వ విధానాలను గుడ్డిగా ఆమోదిచ్మడంగానీ, కష్ట నిష్టూరాలను గమనించకుండా నినాశాత్మకంగా విమర్శించడం కానీ వాంచనీయం కాదని, లభ్య పరిస్థితులలో వీలైనంత కార్యక్రమాన్నైనా ప్రభుత్వం సాధించగలిగించాలనే విషయాన్ని చూపెట్టడమే ఈ పత్రిక ఆశయం.

1948-49 సంచికలోని విషయాలు

మార్చు
  • స్వాతంత్ర్యదినోత్సవం
  • కాందిశీకులు
  • సంస్థానాలు
  • హైదరాబాద్
  • కాశ్మీర్
  • ఇండియా - పాకిస్థాన్ సంబంధాలు
  • వైదేశిక వ్యవహారాలు
  • బడ్జెట్
  • రాష్ట్రాల బడ్జెట్లు
  • ఆర్థిక వ్యవహారాలు - 1
  • ఆర్థిక వ్యవహారాలు - 2
  • ఆహార వ్యవహారాలు
  • కార్మిక వ్యవహారాలు
  • దేశరక్షణ
  • రాజ్యాంగ పరిషత్తు
  • భాషా రాష్ట్రాలు
  • కాంగ్రెస్ రాజకీయాలు
  • రాజకీయ పక్షాలు
  • పర్యావలోకనం

మూలాలు

మార్చు