ఒక త్రిభుజంలో గల ఈ దిగువనీయబడిన తొమ్మిది బిందువుల గుండా పోవు వృత్తమును నవ బిందు వృత్తం అంటారు.

  1. త్రిభుజంలో గల భుజము ల మధ్య బిందువులు (3)
  2. త్రిభుజం యొక్క శీర్షం నుండి ఎదుటి భుజానికి గీయబడిన లంబములు, త్రిభుజం యొక్క భుజంపై కలిసే బిందువులు (లంబ పాదములు) (3)
  3. త్రిభుజ ప్రతీ శీర్షం నుండి లంబ కేంద్రం నకు మధ్య బిందువులు (3)
తొమ్మిది బిందువులు

పై 9 బిందువుల గుండ పోవు వృత్తమును నవ బిందు వృత్తం అంటారు. (nine-point circle)

తొమ్మిది బిందువుల గుర్తింపు

మార్చు

 

పై పటంలో వృత్తము తొమ్మిది జ్యామితీయ బిందువులైన   గుండా పోయింది. ఈ బిందువులలో D, E, Fలు త్రిభుజ భుజాల మధ్య బిందువులు. G, H, I బిందువులు త్రిభుజ భుజాలపై గల లంబ పాదములు. J, K, L బిందువులు త్రిభుజ శీర్షములైన "A", "B", "C" లనుండి లంబకేంద్రం (S) కు గల రేఖాఖండం యొక్క మధ్య బిందువులు.

అల్ప కోణ త్రిభుజంలో భుజాల మధ్య బిందువులు, లంబకెంద్రాలు త్రిభుజం పైన ఉంటాయి. అధిక కోణ త్రిభుజంలో రెడు భుజాల లంబకేద్రాలు త్రిభుజం బయట ఉంటాయి. అయినా నవ బిందు వృత్తం ఈ తొమ్మిది బిందువుల గుండా పోతుంది.

యితర పేర్లు

మార్చు
  • Feuerbach's circle,
  • Euler's circle
  • Terquem's circle
  • the six-points circle
  • the twelve-points circle
  • medioscribed circle
  • mid circle
  • the circum-midcircle.

యివి కూడా చూడండి

మార్చు