తిరుచిరీవరమంగై  (వానమామలై) నాంగునేరి. 15 కి. మీ. తోటాద్రినాథన్ (శిరీవరమంగై)

శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి అందునా ముఖ్యముగ  తెంకలయి సంప్రయదాయానికి ప్రధానమయిన క్షేత్రము. ఇక్కడుండే వానమామలై మఠం విశ్వవిఖ్యాతమయినది. భగవానుడు స్వయముగా వెలిసిన ఎనిమిది క్షేత్రములలో ఇది ఒకటి.

స్థల పురాణము: ఈ  క్షేత్రము లో విష్ణుమూర్తి బ్రహ్మను , ఇంద్రుడును , బ్రిగు మహర్షిని , మర్కెండేయుడు ని అనుగ్రహించెను. ఊర్వశి-తిలోత్తమ ఈ క్షేత్రము లో పెరుమాళ్ ని సేవించుకొన్నారు అందుకే వారి విగ్రహము లు గర్భ గుడి లో స్వామికి వింజామర సేవతో ఉన్నారు. బ్రిగు మహర్షి, మార్ఖెండేయ మహర్షి. సూర్య చంద్ర,. విశ్వక్షేనుడు విగ్రహములు కూడా కొలువై ఉన్నాయి.

ఈ క్షేత్రము లో నాలుగు పెద్దవైన సరస్సులు ఉండేవని ఈ క్షేత్రానికి నాంగునేరి అని పేరు. ప్రస్తుతం ఒక్క సరస్సు మాత్రమే ఉన్నది. ఈ స్థలం స్వయంబూ క్షేత్రములలో ఒకటి. అనగా పెరుమాళ్ స్వయము గా వెలసిన క్షేత్రము. మిగతా క్షేత్రములు బదరి, ముక్తినాథ్, నైమిశారణ్యం, పుష్కరం, తిరువెంగడం (తిరుమల), శ్రీముష్ణం, తిరువరంగం.(శ్రీ రంగం). సాధారణముగా శ్రీదేవి భూదేవిలతో కలిసి ఉండటం కద్దు. గాని ఈ క్షేత్రములో స్వామి శ్రీదేవి, భూదేవిరాలతో పాటు నీలాదేవి కూడా ఉంటారు.అమ్మవార్లకు ప్రాధాన్యత కల్గిన క్షేత్రములు మూడు. అవి నాచ్చియార్ కోవిల్, ఉఱైయూర్ ఇది శిరివరమంగై. ఈ మూడు క్షేత్రములు అమ్మవారి పేరు మీదనే పిలవబడుతున్నాయి. ఒక పర్యాయము శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర చాలించి సృష్టి చేయడము ప్రారంభించాడు. ఆయన నాభీ కమలము నుండి వెలువడిన పద్మములో చతుర్ముఖుడు ఆవిర్భించాడు. శ్రీహరి ఆయనికి వేదాలు ప్రసాదించి సృష్టి కార్యాన్నికొనసాగించమన్నాడు.   ఇలా ఉండగా చతుర్ముఖుడు ఏమరపాటుగా ఉన్న సమయము చూసి మధుకైటభులనే రాక్షషులు ఆ వేదాలను అపహరించికొనిపోయారు. అలా అపహరించడమువలన బ్రహ్మ గుడ్డివానిలా మారిపోయాడు. వేదాలను తిరిగి ప్రసాదించమని శ్రీ మహావిష్ణువుని వేడుకొన్నాడు. స్వామి ప్రసన్నుడై మధుకైటభులను సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇచ్చారు. మధుకైటభులు మరణించి భూమి మీద పడుటవలన భూదేవి కలుషితమయినది. ఆ కాలుష్యమునుండి కాపాడమని శ్రీహరిని ప్రార్దించింది. వాసుదేవుడు ఆమె ప్రార్ధనని మన్నించి శ్రీ దేవి సమేతుడై వానమామలయి క్షేత్రములో నిత్యనివాసము ఏర్పరుచుకున్నాడు. ఇలా స్వామి స్వయముగా అవతరించిన క్షేత్రమిది. కాలక్రమేణ ఈ సన్నిధి మరుగున పడిపోతే తిరిగి కార్య మహారాజు పునఃరుద్దించారు. కార్య మహారాజునకు పుత్రసంతానము లేనందున తిరుక్కురుంగుడి నంబిని ప్రార్ధించగా తోటాద్రి పెరుమాళ్ భూమిలో ఉన్నారు ఆయనని పునరిద్దించి పూజ చేసిన పుత్రులు కలుగురని చెప్పిన ఇచట త్రవించి తీసినపుడు పెరుమాళ్ తలకి గాయమయి రక్తము వచ్చుచుండ రాజు విచారించుచుండ పెరుమాళ్ నూని అభిషేకము ప్రతి దినము చేయమని ఆనతిచ్చిరట. అలా పునఃరుధించినప్పుడు స్వామి శరీరానికి అలసట కలిగినదట. ఆ కారణమువలన వీరికి ప్రతినిత్యము వీరికి తైలముతో అభిషేకము జరుగుతుంది. పంచామృతము తైలము అభిషేకము తరువాత ఒక పెద్ద బావి లోనికి చేరుతుంది. పంచామృతములు కలసిన నూని పాడవుదట.

విశేషము: మూలవిరాట్టు కు ప్రతి దినము తైలాభిషేకం (తిరుమంజనము) జరుగును. తైలాభిషేకము 6 పడిస్  (పడి = 1.5 Kg) నువ్వుల నూని + చందనం నూని. తైలాభిషేకము అయిన పిమ్మట ఈ నూని ని ఇక్కడ గల బావి లో పోసెదరు. ఈ నూనిని తీర్థము గా సేవించవలెను. ఈ నూని విశేషమైన ఔషధ గుణములతో ఉన్నది. అందువలన ఈ నూని ఔషధము లాగ వాడినచో సర్వ రోగములు నివారించబడునని నమ్మకము. 

శ్రీ వైష్ణవ సంప్రదాయములో శ్రీ మద్రామనుజుల తరువాత వీరి అపరావతారముగా కీర్తించబడిన  మణవాళమహమునులు అనే ఆచార్యులు వీరు ఒక పీఠం స్థాపించారు. ఆ పీఠాధిపతి జీయార్  వానమామలై జీయర్ గా ప్రసిద్ధి చెందారు. ఈ మణవాళ మహామునులు 13వ శతాబ్ది లో ధరించిన ఉంగరము ఈ జీయర్ మఠం లో ఇప్పటికినీ ఉన్నది. తుల మాసములో అంటే నవంబర్ నెలలో వచ్చే మూల నక్షత్రము నాడు శ్రీ మణవాల మహామునులు అవతరించారు. ఆ రోజు వానమామలై జీయర్ ఆ ఉంగరాన్ని ధరించి భక్తులకు తీర్థమును ఇస్తారు. సాధరణంగా వైష్ణవ ఆలయాలలో నమ్మాళ్వార్‌లకు  ప్రత్యేకముగా ఆలయము ఉంటుంది కానీ ఇక్కడ ప్రత్యేక ఆలయమే కాదు ఉత్సవ విగ్రహము కూడా లేదు. శ్రీ స్వామి వారి పాదుకలతోనే నమ్మాళ్వార్ల విగ్రహము దర్శనమిస్తుంది. అంటే నమ్మాళ్వార్ భగవంతునికి పాదుకా స్థానీయులన్నమాట. వారి పేరు మీదనే శ్రీహరి పాదుకులకు శఠారి అని పేరు వచ్చింది.

నాంగునేరి రైల్వే స్టేషన్

ఈ క్షేత్రము లో శఠారిపై నమ్మాళ్వార్ ప్రతిమ ఉండును. అందుకే ఆయనని  శటగోపన్ అని అందురు. ఇచ్చట శఠారి పై నమ్మాళ్వార్ ప్రతిమ ఉన్న శఠారి తోనే భక్తులను దీవించెదరు. ఇంకే క్షేత్రము లోనూ శఠారి పై నమ్మాళ్వార్ ల ప్రతిమ లేదు.

సాధారణముగా స్వామి శ్రీ దేవి భూదేవిలతో కలసి ఉండటము కద్దు కానీ ఈ క్షేత్రములో శ్రీ,భూదేవేరులతో పాటు నీలా దేవి కూడా ఉంటారు. గరుడాళ్వార్ ఉత్సవ విగ్రహము మనోహరముగా నుండును. చూడవలెను.

శ్రీ వైష్ణవ 108 దివ్య క్షేత్రములలో అమ్మ వారి ప్రాధాన్యత గల క్షేత్రములు మూడు. 1. నాచ్చియార్ కోయిల్ (మణి మాడ కోయిల్) 2. ఉఱైయూర్ (తిరుక్కొళి) 3. సిరీవరమంగై. ఈ మూడు క్షేత్రములు అమ్మవారి పేరుమీద నే పిలువబడుతాయి. ఇచ్చట విశ్వరూప దర్శనం మొదట మణవాల మాముని వారిది జరుగును తరువాత మూలవర్ విశ్వరూప దర్శనము. ఇచ్చట విశ్వరూప దర్శనం కొరకు ఆవు, ఏనుగును తెచ్చే ఆచారము లేదు. హారతియే ఇచ్చుదురు.

మూలవిరాట్ట్: తోటాద్రి నాథన్ భూదేవి శ్రీదేవి సమేతము. తిరుక్కోలము: వీట్రిరుంధ క్కోలము (కూర్చున్న సేవ)  ఆదిశేషుడు తో తిరుముగము: తూర్పు.

ఉత్సవర్: దేవ నాయగ పెరుమాళ్. తేయ్ వనాయకన్ (వానమామలై పెరుమాళ్)

తాయార్: సిరీవరమంగై నాచ్చియార్ 

పుష్కరిణి: ఇంద్ర పుష్కరిణి సేత్తు తామరై పుష్కరణి

విమానం: నందివర్ధన విమానం

ప్రత్యక్షం: బ్రహ్మ, బృఘు, గరుత్మంతుడు, రోమాశ, మర్కెండేయ మహర్షులకు.

ఆళ్వార్ మంగళాశాసనం: నమ్మాళ్వార్: 3183-3193 (11) తి. మొ. 5-7-6,10. నాలాయిర దివ్య ప్రభందం  పాశురముల పట్టిక ప్రకారం

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు