నాగనాథ్ నాయక్‌వాడి
నాగనాథ్ నాయక్‌వాడి (1922–2012) - క్రాంతివీర్ నాగనాథ్ అన్నగా సుప్రసిద్ధుడు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు.[1] విద్యావేత్త. సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు.
నాగనాథ్ నాయక్‌వాడి | |
---|---|
జననం | |
మరణం | 2012 మార్చి 22 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 89)
వృత్తి | సామాజిక కార్యకర్త భారత స్వాతంత్ర్య కార్యకర్త విద్యావేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 1939–2012 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ప్రతి సర్కార్ |
జీవిత భాగస్వామి | కుసుమ్ |
పిల్లలు | ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
తల్లిదండ్రులు | రామచంద్ర గణపతి నాయక్‌వాడి లక్ష్మీబాయి |
పురస్కారాలు | పద్మ భూషణ్ |
జీవిత చరిత్ర
మార్చునాగనాథ్ నాయక్‌వాడి 15 జూలై 1922న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా(పూణే సమీపంలో)లోని వాల్వా అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి రామచంద్ర గణపతి నాయక్‌వాడి, తల్లి లక్ష్మీబాయి.[2] వాల్వా, అష్టా గ్రామాల్లోని స్థానిక పాఠశాలల్లో ప్రారంభ పాఠశాల విద్య అభ్యసించాడు. ఆ తరువాత 1948లో కొల్హాపూర్‌లోని రాజారామ్ హైస్కూల్‌లో చదివి మెట్రిక్యులేషన్ పూర్తి చేసాడు. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం వల్ల కొంతకాలం చదువుకు విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం రాజారాం కాలేజీలో చేరాడు. కానీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో విప్లవాత్మక కార్యాచరణకు నాగనాథ్ నాయక్‌వాడి ప్రసిద్ధి చెందాడు. అతను క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో నానా పాటిల్ సహచరుడుగా మారాడు.[3] వారు ఇరువురు కలసి మహారాష్ట్రలోని సతారా-సాంగ్లీ ప్రాంతంలో ప్రతి సర్కార్ అనే సమాంతర ప్రభుత్వాన్ని స్థాపించారు.[4] బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్యం తరువాత, అతను ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాడు. సాంగ్లీ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ మహారాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టాడు.[5] భారతీయ సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను 2009లో భారత ప్రభుత్వం అతనికి మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందించింది.[6] 22 మార్చి 2012న, 89 సంవత్సరాల వయస్సులో నాగనాథ్ నాయక్‌వాడి ముంబైలోని బాంద్రాలోని లీలావతి ఆసుపత్రిలో వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మరణించాడు. అతనికి భార్య కుసుమ్, ఇద్దరు కుమారులు వైభవ్, కిరణ్; ఇద్దరు కుమార్తెలు విశాఖ, ప్రగతి ఉన్నారు.
స్వాతంత్ర్య ఉద్యమకారుడు
మార్చు1940లలో నాగనాథ్ నాయక్‌వాడి అతని సహచరులు బ్రిటిష్ వలస ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ఆశ్రయించారు. ఉద్యమానికి నిధుల సేకరణ కోసం, అతని బృందం ధూలేలోని ప్రభుత్వ ఖజానాను దోచుకుంది. హైదరాబాద్ నిజాంపై తిరుగుబాటుకు మద్దతు ఇచ్చింది.[7] బ్రిటీష్ పోలీసులతో అతని వాగ్వివాదం సందర్భంగా, అతను బుల్లెట్‌తో గాయపడిన తర్వాత పట్టుబడ్డాడు. సతారా జైలులో కస్టడీలో ఉన్న ఆయన తన తోటి ఖైధీలతో కలసి తప్పించుకున్నాడు. బ్రిటీష్ వలస ప్రభుత్వం అతన్ని పట్టించినవారికి బహుమతిని ప్రకటించింది. అయినా నాగనాథ్ నాయక్‌వాడి నాలుగు సంవత్సరాలు అండర్గ్రౌండ్ లో ఉండగలిగాడు.[8] 1943లో నానా పాటిల్, కిసన్‌రావ్ అహిర్.. మరికొంతమందితో కలసి, అతను ప్రతి సర్కార్ అనే సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించాడు. ఇది సతారా - సాంగ్లీలతో కూడిన పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోని దాదాపు 150 గ్రామాలలో పనిచేసింది.[9]
గుర్తింపు
మార్చు- 2008లో శివాజీ విశ్వవిద్యాలయం, నాగనాథ్ నాయక్‌వాడిని డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పట్టాతో సత్కరించింది.
- 2009లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పౌర గౌరవాన్ని అందించింది.
- మహారాష్ట్ర ప్రభుత్వం నాగనాథ్ నాయక్‌వాడి స్వస్థలంలో ₹150 మిలియన్ల వ్యయంతో 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక హాలు, మ్యూజియంతో కూడిన స్మారక చిహ్నాన్ని నిర్మించింది.
మూలాలు
మార్చు- ↑ "Freedom fighter Nagnath Naikavdi no more". Zee News. 22 March 2012. Retrieved 27 June 2016.
- ↑ "Founder". Kissan Shiksha Sansthan. 2016. Archived from the original on 12 ఫిబ్రవరి 2016. Retrieved 28 June 2016.
- ↑ "Historical Career of Padmabhushan Krantiveer Dr.Nagnathanna Nayakawadi" (PDF). Nagnathanna. 2016. Retrieved 28 June 2016.
- ↑ "Freedom Fighter Nagnath Naikavdi Dead". News Wire. 22 March 2012. Retrieved 27 June 2016.
- ↑ "Nagnath Naikwadi – a revolutionary of a different mould". First Post. 23 March 2012. Retrieved 27 June 2016.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 3 January 2016.
- ↑ "Nagnath Naikwadi – a revolutionary of a different mould". First Post. 23 March 2012. Retrieved 27 June 2016.
- ↑ "Freedom Fighter Nagnath Naikavdi Dead". News Wire. 22 March 2012. Retrieved 27 June 2016.
- ↑ "Nagnath Naikwadi – a revolutionary of a different mould". First Post. 23 March 2012. Retrieved 27 June 2016.