ఇది శాసనాల్లో గుర్తించబడిన మొదటి తెలుగు పదము. దీనిని శాసనములలొ కనుక్కున్నారు. పరిశోధకులు దీనిని మొదటి తెలుగు భాషా పదంగా గుర్తించారు.

ఈ పదం ఉన్న రాతిబండ అమరావతి స్తూపం దిబ్బలలో దొరికింది. ఇది ఒక వ్యక్తి పేరు. పురాతత్వ పండితులు కొందరు దీనిని "నాగ - బు" అని పద విభాగం చేసి, రెండూ వేరువేరు పాలీబాషా పదాలని భ్రాంతిపడ్డారు. కానీ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇది తెలుగుపదమని, నాగబు అనేది తెనుగు ప్రధమావిభక్తి ప్రత్యాయంతో ఉన్న నాగ అనే తత్సమపదమని, నాగంబు నాగము అనే నేటి రూపాల పూర్వస్వరుపమని సకారణంగా నిరూపించారు. నాగబు అంటే నాగము లేదా పాము అని అర్థం

"https://te.wikipedia.org/w/index.php?title=నాగబు&oldid=2973222" నుండి వెలికితీశారు