తిరుమల వేంకటేశ్వరుని నాగాభరణాలు
'వీరనరసింహ దేవుడ'నే గజపతి నేడున్న తిరుమల తిరుపతి దేవస్థానం మహాద్వారానికి పునాది వేయించిన వాడు. ఈయన రామేశ్వర యాత్రకు వెళ్తూ తిరుమలలో స్వామిని దర్సించుకొని ఏదైనా కైంకర్యం చేయాలని తలచి పండితుల సలహా మేరకు రాజగోపురాన్ని (మహాద్వారాన్ని) నిర్మించడానికి అవసరమయ్యే ధనాన్ని, మనుషులను సమకూర్చి రామేశ్వరం వెళ్ళి, తిరిగివచ్చి దగ్గరుండి నిర్మాణం పనులు చూసుకొంటుండగా ఒక రోజు రాత్రి ఆదిశేషుడు (శేషపాన్పు) "ఓ వీరనరసింహా! నీవు కట్టిస్తున్న ఈ గోపురము నాకు మిక్కిలి భారమై వుంది. నాకు కలిగిన ఈ బాధను శేషాద్రి శిఖర వాసుడైన శ్రీ వేంకటేశ్వరుడు తీర్ఛవలసిందే కానీ వేరెవరివల్లా కాదు" (శేషాద్రి ఆదిశేషుని రూపం) అని గర్బాలయం లోనికి వెళ్ళి స్వామి వారి ఎడమ చేతికి చుట్టుకొన్నట్లు కల వచ్చింది. దానితో ఆదిశేషునికి అపరాధం చేసినట్లు భావించిన గజపతి ఆ నిర్మాణాన్ని అంతటితో ఆపివేసి ఆదిశేషునికి గుర్తుగా ఒక బంగారు నాగాభరణాన్ని చేయించి స్వామివారి ఎడమ భుజానికి అలంకరింపచేసాడు.[1] అలా వేంకటేశ్వరుడు పన్నగభూషణుడు అయినాడు. తరువాత రామానుజులవారు రెండవ భుజానికి వేరొక నాగాభరణాన్ని చేయించి అమర్చారు. అలా వీరనరసింహ దేవుడు గోడలవరకూ కట్టించి ఆపివేసిన ఆ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు పూర్తిచేయించాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "2.Only one nagabharanam was decorated on the Lord's left hand. | Chinnajeeyar". web.archive.org. 2022-07-14. Archived from the original on 2022-07-14. Retrieved 2022-07-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Srivenkatachala Itihasamala - S.Krishnaswami పేజీ.25-26