నాగినేని కన్నయ్యనాయుడు

నాగినేని కన్నయ్యనాయుడు, భారతదేశానికి చెందిన రిటైర్డ్‌ ఇంజినీర్‌, సాంకేతిక సలహాదారుడు. ఆయన ప్రధానంగా దేశంలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో గేట్లు ఏర్పాటు చేయడం, మరమ్మతు చేయడంలో ప్రసిద్ధి చెందాడు. ఆగస్టు 2024లో తుంగభద్ర జలాశయంలో వరదలకు కొట్టుకుపోయిన క్రస్టుగేటు స్థానంలో కేవలం వారం రోజుల్లోనే స్టాప్‌లాగ్‌ ఏర్పాటు చేసాడు.[1]

నాగినేని కన్నయ్యనాయుడు
జననం1946 (age 77–78)
రాసానపల్లె, గుడిపాల మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయతభారతీయుడు
వృత్తిరిటైర్డ్‌ ఇంజినీర్‌

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా ఆయనను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2024 ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది.[2]

ప్రారంభ జీవితం

మార్చు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రాసానపల్లెలో 1946లో రైతు కుటుంబంలో కన్నయ్య నాయుడు జన్మించాడు ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసాడు.[3]

కెరీర్

మార్చు

తమిళనాడులోని సదరన్‌ స్ట్రక్చర్స్‌ కంపెనీలో కొంతకాలం పనిచేసిన ఆయన హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర స్టీల్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ లో డిజైన్స్‌ విభాగంలో పలు పదవులు చేపట్టాడు. జలాశయాలకు క్రస్ట్‌ గేట్ల నిర్మాణం, విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లలో యంత్రాల అమరిక వంటి ఇంజనీరింగ్ పనులలో అనుభవం ఉన్న ఆయన దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా ప్రాజెక్టుల గేట్ల నిర్మాణంలో పాల్గొన్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో శ్రీశైలం, నాగార్జునసాగర్, సోమశిల, ప్రియదర్శిని జూరాల ఆనకట్టల గేట్ల నిర్మాణం, మరమ్మతుల్లోనూ ఆయన పాల్గొన్నాడు. ముఖ్యంగా, ప్రకాశం బ్యారేజి నీటిమట్టం తగ్గించకుండానే గేటుకు మరమ్మతులు చేయించిన ఘనత ఆయనది.[3]

2024 తుంగభద్ర ఆనకట్ట విపత్తు

మార్చు

కర్ణాటకలోని హోస్పేట్‌ సమీపాన 1953లో నిర్మించిన తుంగభద్ర ఆనకట్ట నీటి ఒత్తిడికి 2024 ఆగస్టు 10న 19వ క్రస్ట్‌గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కాగా, దాని స్థానంలో స్టాప్‌లాగ్‌ ఏర్పాటు చేసారు. ఆ ప్రక్రియ ఆగస్టు 17 నాటికి విజయవంతంగా ముగిసింది.[4] దీంతో వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట పడింది.[5]

మూలాలు

మార్చు
  1. "రైతుల కోసమే ఆరాటం! | Longing for the farmers!". web.archive.org. 2024-08-19. Archived from the original on 2024-08-19. Retrieved 2024-08-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Kannayya Naidu: జలవనరులశాఖ సలహాదారుగా కన్నయ్యనాయుడు | ap-govt-appoints-irrigation-engineering-expert-kannayya-naidu-as-advisor". web.archive.org. 2024-08-30. Archived from the original on 2024-08-30. Retrieved 2024-08-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 "Kannaiah Naidu: విపత్తులకు గేట్లు మూసేస్తారాయన .. తుంగభద్రను కాపాడిన కన్నయ్యనాయుడు | hydro-mechanical-engineer-kannaiah-naidu-success-journey". web.archive.org. 2024-08-19. Archived from the original on 2024-08-19. Retrieved 2024-08-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "విజయవంతంగా స్టాప్‌లాగ్‌ గేటు ఏర్పాటు | Successfully set up stoplog gate | Sakshi". web.archive.org. 2024-08-19. Archived from the original on 2024-08-19. Retrieved 2024-08-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "తుంగభద్ర ఆనందతాండవం | general". web.archive.org. 2024-08-19. Archived from the original on 2024-08-19. Retrieved 2024-08-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)