నాగ్దా

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

నాగ్దా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో, చంబల్ నది బేసిన్లో ఉన్న పారిశ్రామిక పట్టణం. 2020 మార్చిలో నాగ్దా ముఖ్యపట్టణంగా నాగ్దా జిల్లాను ఏర్పాటు చేసారు. [1] ఇది పశ్చిమ మధ్యప్రదేశ్ లోని మాళ్వా ప్రాంతంలో, చంబల్ నది ఒడ్డున ఉంది.

నాగ్డా రైల్వే స్టేషన్

జనాభా మార్చు

నాగ్దాలో మతం
హిందూ మతం
  
81.68%
ఇస్లాం
  
14.58%
క్రైస్తవం
  
0.81%
జైనమతం
  
2.09%
బౌద్ధమతం
  
0.53%
సిక్కుమతం
  
0.53%
ఇతరాలు♦
  
0.29%
Distribution of religions
Includes Other religions (0.00%).

భారత జనగణన లెక్కల ప్రకారం, [2] 2011 లో నాగ్డా జనాభా 1,00,039. వీరిలో పురుషులు 51,373, స్త్రీలు 48,666 ఉన్నారు.

నాగ్డాలో అక్షరాస్యుల సంఖ్య 71,472. వీరిలో 40,073 మంది పురుషులు, 31,399 మంది మహిళలు ఉన్నారు. పట్టణంలో అక్షరాస్యత రేటు 80.71%. ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 88.43% కాగా స్త్రీల అక్షరాస్యత 72.62%. నాగ్డా జనాభాలో 11.48% మంది అరేళ్ళ లోపు పిల్లలు. [3]

2011 జనాభా లెక్కల ప్రకారం, నాగ్డా నగరంలో హిందూ మతస్థులు 81.68%. ఇస్లాం రెండవ అత్యంత ప్రాచుర్యం పొందిన మతం. సుమారు 14.58% మంది దీనిని అనుసరిస్తున్నారు. పట్టణంలో క్రైస్తవ మతాన్ని 0.81%, జైన మతాన్ని 2.09%, సిక్కు మతాన్ని 0.53%, బౌద్ధమతాన్ని 0.53% మంది పాటిస్తున్నారు. సుమారు 0.00% మంది ఇతర మతావలంబికులు. సుమారు 0.29% మంది 'ప్రత్యేకంగా మతమంటూ లేదు' అని పేర్కొన్నారు.

రవాణా సౌకర్యాలు మార్చు

రైలు మార్చు

ఇది, పశ్చిమ రైల్వేలో ఢిల్లీ-ముంబై ప్రధాన మార్గాన్ని భోపాల్‌తో అనుసంధానించే మార్గంలో ఒక ముఖ్యమైన జంక్షన్ స్టేషను. జైపూర్, ముంబై, ఢిల్లీ, భోపాల్ లకు వెళ్లే అన్ని రైళ్ళకు ఇది ఒక ముఖ్యమైన స్టాప్. నాగ్డా జంక్షన్ గుండా వెళ్ళే ప్రధాన మార్గాలు: ముంబై- కోట జంక్షన్ ద్వారా ఢిల్లీ లైన్ (బ్రాడ్ గేజ్ లైన్).

విమానసేవలు మార్చు

సమీప విమానాశ్రయం ఇండోర్‌ లోని దేవి అహిల్యా బాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, 110 కి.మీ. దూరంలో ఉంది.

రోడ్డు మార్చు

నాగ్డాకు జావోరా ద్వారా జాతీయ రహదారి 79 తో కనెక్టివిటీ ఉంది.

మూలాలు మార్చు

  1. Jun 12, Sagar Choukse | TNN | Updated; 2019; Ist, 22:38. "| Indore News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-09-14. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. "Nagda City Census 2011 data". www.census2011.co.in.
  3. "Nagda City Population Census 2011-2019 | Madhya Pradesh". www.census2011.co.in. Retrieved 2019-04-11.
"https://te.wikipedia.org/w/index.php?title=నాగ్దా&oldid=3595064" నుండి వెలికితీశారు