నాట్ల పాటలు పొలంలో నాట్లు వేసే సమయంలో తమ శ్రమను మరచిపోవడానికి శ్రామికులు పాడే పాటలు.

వరి, మిరప, వంగ, టొమేటో లాంటి పంటలను ముందుగా బావుల కిందనో, చెరువుల కిందనో, దొరువుల కిందనో కొంత నేలను తడిపి చిక్కగా నారుపోసి పండిస్తారు. ఇవి చిన్నచిన్న కయ్యలు కాబట్టి నీరు పొయ్యడం, సంరక్షించడం సులువైన పని. నారు మొలకలు వచ్చి దాదాపు నెల రోజులు పెరిగిన తర్వాత ఆ నారును పీకి చిన్న చిన్న కట్టలుగా కట్టి తోటల్లోకి తీసుకువచ్చి నాటుతారు. నారును సాధారణంగా స్త్రీలే నాటుతారు. నాట్లు వేసేటప్పుడు వారు తమ శ్రమను మరిచిపోవడానికి పాడుకునే పాటలే నాట్ల పాటలు. ఒకరు పాడుతుంటే ఇతరులు పలుకుతుంటారు.

పాటసవరించు

రైతులు అనేక వ్యయప్రయాసలకోర్చి భూమిని సాగు చేస్తారు. విత్తులు జల్లి, ఆకును ఉడిచి, కలుపు తీసి, కోతల వరకూ పడే వారు శ్రమను వాళ్లు మరచి పోవడానికి పాట ఊతమైంది. ఓ ‘నాట్ల’ పాట.[1]

గట్టూ మాకులు గట్టి గడలూ బొందిచ్చి
గట్టు రాయని ఇంట్లో పుట్టే గౌరమ్మ
గట్టూ మాకులు గట్టి గడలూ బొందిచ్చి
గట్టు రాయని ఇంట్లో పుట్టే గౌరమ్మ ।।
పుట్టుటే గౌరమ్మ ఏమేమి  గోరు
కుట్టూ వయ్యారి రవికె, కుంకూమా కాయ
జాల వయ్యారి రవికె, జామాల పేరు
వంకా చక్కటి కుడక వజ్రాల పేరు ।।

శ్రామికులు వరినాట్లు వేస్తున్న భూయజమాని ఇంట్లో పుట్టిన గౌరీ దేవతను వర్ణించిన గీతం ఇది.

సారంగధరియాసవరించు

జానపదులు పాడుకునే నాట్ల పాట "సారంగ ధరియా' యూట్యూబ్ సెన్సేషన్ అయింది.[2]

మూలాలుసవరించు

  1. "కలం చెప్పని కవిత్వం". www.teluguvelugu.in. Retrieved 2021-06-11.
  2. "సారంగ దరియా: జానపదులు పాడుకునే ఈ పొలం పాట యూట్యూబ్ సెన్సేషన్ ఎలా అయింది?". BBC News తెలుగు. Retrieved 2021-06-11.

బాహ్య లంకెలుసవరించు