నాబాకిషోర్ దాస్

ఒడిశా రాజకీయ నాయకులు

నాబాకిషోర్‌ దాస్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఝార్సుగూడా నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

నాబాకిషోర్‌ దాస్
నాబాకిషోర్ దాస్


ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2019 మే 29 – 2023 జనవరి 29

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – ప్రస్తుతం
నియోజకవర్గం ఝార్సుగూడా

వ్యక్తిగత వివరాలు

జననం 1962 జనవరి 7
ఝార్సుగూడా, భారతదేశం
మరణం 2023 జనవరి 29(2023-01-29) (వయసు 61)
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఘనశ్యామ్ పాండా
జీవిత భాగస్వామి మినాతి దాస్
సంతానం ఒక కుమార్తె

రాజకీయ జీవితం

మార్చు

నాబాకిషోర్‌ దాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ఝార్సుగూడా నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. నాబాకిషోర్‌ దాస్ బిజూ జనతా దళ్ పార్టీ లో చేరి 2019లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 మే 29న నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

నబా కిషోర్ దాస్ 2023 జనవరి 29న ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్‌ నగర్‌లోని గాంధీ చౌక్‌ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లి తన కారు నుంచి దిగినప్పుడు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ దాస్ జరిపిన కాల్పుల్లో గాయపడిన ఆయనను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.[3]

మూలాలు

మార్చు
  1. The Hindu (29 May 2019). "List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet" (in Indian English). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  3. 10TV Telugu (29 January 2023). "పోలీస్ కాల్పుల్లో గాయపడిన మంత్రి మృతి, ఫలించని డాక్టర్ల ప్రయత్నాలు". Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)