నారాయణపూర్ (ఛత్తీస్‌గఢ్)

నారాయణపూర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్య పట్టణం కూడా. 2007 మే 11 న బస్తర్ జిల్లా నుండి సృష్టించబడిన రెండు కొత్త జిల్లాలలో ఇది ఒకటి. [1]

నారాయణపూర్‌లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువ. ఈ ప్రాంతంలోని గిరిజనులు ఆర్థికాభివృద్ధికి నోచుకోక పోవడమే దీనికి ప్రధాన కారణం. 1985 లో రామకృష్ణ మిషన్ ఈ తెగల అభివృద్ధికి కృషి చేసింది. అభివృద్ధిలో భాగంగా పాఠశాలలు, ఆట స్థలం, గిరిజనులకు ఒక స్టేడియం నిర్మించారు.

రాయపూర్ నుండి రాజ్‌నంద్‌గావ్, జగదల్‌పూర్‌ల మీదుగా నారాయణపూర్‌కు బస్సులు అందుబాటులో ఉన్నాయి. జగదల్పూర్ నుండి నారాయణపూర్ 120 కి.మీ. దూరంలో ఉంది.

మూలాలు

మార్చు
  1. Srivastava, Dayawanti, ed. (2010). India 2010, A Reference Annual (PDF). New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of Indiaand. p. 1122. ISBN 978-81-230-1617-7. Archived from the original (PDF) on 29 December 2010. Retrieved 23 January 2012.