నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023

లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ' నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023 ' పేరుతో తీసుకొచ్చిన చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది[1]. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం[2]. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023 పేరుతో తీసుకొచ్చిన 128 వ రాజ్యాంగ సవరణ బిల్లు 2023 సెప్టెంబర్ 20వ తేదీన లోక్ సభ ఆమోదం పొందింది[3]. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 (2) ప్రకారం ఈ బిల్లు ఆమోదం పొందింది. దీని ప్రకారం సభలోని మొత్తం సభ్యులు మూడింట రెండు వంతుల మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది[4]. 2023 సెప్టెంబర్ 19వ తేదీన లోక్ సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ 128 సవరణ బిల్లు - 2023 పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 454 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. లోక్ సభలో సెప్టెంబర్ 20వ తేదీన ఆమోదం పొందిన మహిళ రిజర్వేషన్ బిల్లు 21వ తేదీన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు[5]. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో భారీ మద్దతు లభించింది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే మహిళ రిజర్వేషన్ బిల్లు చట్టం రూపం దాలుస్తుంది.

మూలాలు :

  1. "మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... ఈ బిల్లు గురించి తెలుసుకోవాల్సిన 6 కీలక అంశాలు". BBC News తెలుగు. 2023-09-19. Retrieved 2023-10-22.
  2. "Womens Reservation Bill 2023: మహిళా బిల్లుకు జై". Sakshi. 2023-09-21. Retrieved 2023-10-22.
  3. "మహిళా రిజర్వేషన్ బిల్లు.. 2029 ఎన్నికలతో అమల్లోకి!". Samayam Telugu. Retrieved 2023-10-22.
  4. "Womens Reservation Bill 2023 : పార్లమెంట్​ ఆమోదించినా.. మహిళా రిజర్వేషన్ల అమలు 2029లోనే సాధ్యం.. ఎందుకంటే?". ETV Bharat News. Retrieved 2023-10-22. {{cite web}}: zero width space character in |title= at position 42 (help)
  5. Desk 4, Disha Web (2023-09-19). "మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి.. దాని చరిత్ర ఇదే..!". www.dishadaily.com. Retrieved 2023-10-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)