నార్కొ అనాలసిస్

నార్కొ అనాలసిస్ పరీక్ష లేదా నార్కొ పరీక్ష: ఈ పరీక్షలో కొన్ని రసాయన ద్రవ్యాల ద్వారా (చాలా వరకు పెంటోథాల్ సోడియం) ఒక ముద్దాయి ఆలోచనా శక్తిని తాత్కాలికంగా తగ్గించి, ఆ ముద్దాయి తన ఆలోచనలని జరిగిన ఘటనలను ఇతరులతో పంచుకొనేటట్లు చేయటం. నార్కొ అనాలసిస్ అనే పదమును మొదట వాడినది హార్సెల్లీ అనే శాస్త్రవేత్త. నార్కొ అనాలసిస్ ని మొట్టమొదట ఖైదీలమీద వాడినది రాబర్ట్ హౌస్ అనే వైద్యుడు. దానిని 1922లో వాడాడు. అయితే ఈ పరీక్ష మీద చాలా అనుమానాలు, నైతికత ప్రశ్నలు ఉన్నాయి.

ఒక వ్యక్తి అబద్దమాడాలంటే అతను ఎంతో కొంత మనసులో ఊహించుకోవాలి. నార్కొ అనాలసిస్ లో ఇవ్వబడే రసాయనం ఈ శక్తిని తగ్గించి వేస్తుంది. ఆ వ్యక్తి సగం నిద్రలో ఉన్నట్లు నిజాలే చెప్పాల్సి వస్తుంది. ఈ పరీక్షలో సోడియం పెంటోథాల్ లేదా సోడియం అమైతాల్ అనే పదార్దాలని ముందుగా నిర్ణయించబడిన మోతాదులో ఇస్తారు. ఈ మోతాదు ఆ వ్యక్తి యొక్క వయసు, లింగము, ఆరోగ్య స్థితి, జాతి, ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ చర్యలకు లోనుకాబడిన వ్యక్తి ఏదీ ఆలోచించి మాట్లాడలేడు. చిన్న చిన్న ప్రశ్నలకు అవును లేదా కాదు అని జరిగినదానిని బట్టి సమాధానమివ్వగలడు. ఇలాంటి పరీక్షలను జరపాలా వద్దా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కొన్ని అధ్యనాలు ఈ నార్కో పరీక్షలో అబద్ధం చెప్పటం సాధ్యమే అని నిరూపించాయి. కొన్ని ప్రజాస్వామ్య దేశాలు (ఎక్కువగా భారతదేశం) ఈ పరీక్షని వాడుతున్నాయి.

భారతదేశంలో, ఈ పరీక్షని ఒక మత్తు వైద్యుడు, ఒక మానసిక వైద్య నిపుణుడు, ఒక మానసిక శాస్త్రవేత్త, ఒక వీడియో ఫోటోగ్రాఫరు, ఇతర సహాయ సిబ్బంది పర్యవేక్షణలో జరపబడుతుంది. మానసిక శాస్త్రవేత్త అడగాల్సిన ప్రశ్నలు, వాటికి సంబందించి ఆ వ్యక్తి మెదడు పనితీరుని విశ్లేషిస్తాడు.

బయటి లింకులు మార్చు