నికోలస్ కేజ్
నికోలస్ కేజ్ ( ఆంగ్లం : Nicolas Cage ) ఒక అమెరికన్ సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు, ఇతను ఫేస్/ఆఫ్ సినిమా 1997 లో, లీవింగ్ లాస్ వెగాస్ సినిమా 1995 లో, ది రాక్ సినిమా 1996 లో, నెక్స్ట్ సినిమా 2007 లో గుర్తింపు తెచ్చుకున్నాడు. రొమాంటిక్ కామెడీలు, డ్రామాల నుండి సైన్స్ ఫిక్షన్, యాక్షన్ చిత్రాల వరకు విభిన్న చిత్రాలలో ప్రధాన పాత్రలలో నటించాడు. అకాడమీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులను పొందాడు.[2]
నికోలస్ కేజ్ | |
---|---|
జననం | నికోలస్ కిమ్ కొప్పోలా 1964 జనవరి 7 గ్ బీచ్, కాలిఫోర్నియా, U.S. |
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1981–present |
నికర విలువ | $25 బిలియన్లు (2017)[1] |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 2 |
కుటుంబం | Coppola |
వ్యక్తిగత జీవితం
మార్చునికోలస్ కేజ్ 1964-01-07 తేదీన లాంగ్ బీచ్, కాలిఫోర్నియాలో జన్మించాడు[3], అతని తండ్రి ఇటాలియన్ సంతతికి చెందినవారు, తల్లి పోలిష్ వంశానికి చెందినవారు. అతని తల్లితండ్రులు సంగీతకారుడు కార్మైన్ కొప్పోలా, నటి ఇటాలియా పన్నినో., అతని తాత ముత్తాతలు బెర్నాల్డ్, బసిలికాటా, ఇటలీ నుండి వలస వచ్చినవారు. అతను చిన్నప్పటి నుండి నటించాలని ఆకాంక్షించాడు, UCLA స్కూల్ ఆఫ్ థియేటర్, ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో నటనను అభ్యసించాడు.1988లో, కేజ్ నటి క్రిస్టినా ఫుల్టన్‌తో డేటింగ్ ప్రారంభించాడు, వారికి వెస్టన్ కొప్పోలా కేజ్ ( 1990 డిసెంబరు 26) అనే కుమారుడు ఉన్నాడు.ఇతను మూడు సార్లు వివాహం చేసుకున్నాడు. అతని మొదటి భార్య నటి ప్యాట్రిసియా ఆర్క్వెట్తీ ( 1995 ఏప్రిల్ 8న వివాహం, 2011 మే 18న విడాకులు తీసుకున్నారు). కేజ్ రెండవ వివాహం గాయని/గేయరచయిత లిసా మేరీ ప్రెస్లీతో 2002 ఆగస్టు 10న వివాహం జరిగింది, వారికి లిసా ఎల్విస్ ప్రెస్లీ అనేకూతురు. ఈ జంట 2002 నవంబరు 25న విడాకులు తీసుకున్నారు. కేజ్ యొక్క మూడవ, ప్రస్తుత భార్య ఆలిస్ కిమ్, ఆమె గతంలో లాస్ ఏంజిల్స్ రెస్టారెంట్ కబుకి, లాస్ ఏంజిల్స్ కొరియన్ నైట్‌క్లబ్‌లో వెయిట్రెస్‌గా పనిచేసింది. వారు 2004 జూలై 30న ఉత్తర కాలిఫోర్నియాలో వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు కల్ ఎల్ ( సూపర్‌మ్యాన్ జన్మ పేరు) 2005 అక్టోబరు 3 న జన్మించాడు.
వృత్తి
మార్చుకేజ్ 1981లో తన టెలివిజన్ అరంగేట్రం చేసాడు, నటనలో వృత్తిని కొనసాగించాడు. "బ్యాడ్ బాయ్"లో తన పాత్రకు కేజ్ అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వీటిలో లీవింగ్ లాస్ వేగాస్‌లో ప్రధాన పాత్ర పోషించినందుకు 1995లో ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు , అడాప్టేషన్‌లో అతని పాత్రకు 2002లో ఉత్తమ నటుడిగా టొరంటో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఉన్నాయి .ఫేస్/ఆఫ్ (1997), గాన్ ఇన్ 60 సెకండ్స్ (2000), నేషనల్ ట్రెజర్ (2004), ఘోస్ట్ రైడర్ (2007), బాడ్ లెఫ్టినెంట్: పోర్ట్ ఆఫ్ కాల్ న్యూ ఓర్లీన్స్ (2009)తో సహా 70కి పైగా చిత్రాలలో కేజ్ నటించాడు.ఆర్థికంగా విజయం సాధించిన కేజ్ యొక్క చాలా సినిమాలు యాక్షన్ తరహా చిత్రాలే[4],32 సంవత్సరాల వయస్సులో, 1996లో, అతను " లీవింగ్ లాస్ వేగాస్ "లో మద్యపానానికి బానిసైన పాత్రకు ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును గెలుచుకున్నాడు,2001 మేలో, కేజ్‌కి కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ ద్వారా ఫైన్ ఆర్ట్స్‌లో గౌరవ డాక్టరేట్ లభించింది.
మూలాలు
మార్చు- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Martin.Emmie
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Nicolas Cage". IMDb. Retrieved 2022-01-07.
- ↑ "Nicolas Cage | Biography, Movies, Oscar, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-07.
- ↑ "A Tribute to Nicolas Cage: The Rise, Journey & Latest 'Adaptation' of Our 'Kick-Ass' 'National Treasure' - Hollywood Insider". www.hollywoodinsider.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-01-10. Retrieved 2022-01-07.