నిజాం ఉద్దీన్ భట్

నిజాం ఉద్దీన్ భట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బండిపొర నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

మార్చు

నిజాం ఉద్దీన్ భట్ తన రాజకీయ జీవితాన్ని దివంగత అబ్దుల్ గని లోన్ నాయకత్వంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ (పిసి) పార్టీ ద్వారా ప్రారంభించి 1983, 1987 ఎన్నికలలో బండిపోరా నుండి పీపుల్స్ కాన్ఫరెన్స్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1989లో కాశ్మీర్‌లో సాయుధ పోరాటం ప్రారంభమైన తర్వాత రాజకీయాలకు దూరమై వివిధ జాతీయ & అంతర్జాతీయ మీడియా సంస్థల కోసం పని చేస్తూ ఈటీవీ & ది ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ బ్యూరో చీఫ్‌గా పని చేశాడు.[4]

నిజాం ఉద్దీన్ భట్ 2003-04లో తిరిగి రాజకీయాల్లోకి వచ్చాడు జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలో చేరి 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బండిపొర నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఉస్మాన్ మజీద్‌ను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికలలో ఓడిపోయి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2024లో బండిపొర నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. TimelineDaily (8 October 2024). "Jammu & Kashmir Election Results 2024: Congress' Uddin Bhat Wins In Bandipora" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
  3. India Today (8 October 2024). "Bandipora, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: INC's Nizam Uddin Bhat defeats Independent candidate Usman Abdul Majid with 811 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
  4. Asian Mail (2 October 2021). "After 3 decades, Nizamuddin Bhat set to return to PC". Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Bandipora". Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.