నిడుమోలు మాలా, భారతీయ న్యాయమూర్తి. ఆమె అభ్యుదయ కవి శ్రీశ్రీ కుమార్తె. న్యాయవాదుల కోటాలో చెన్నై హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2022లో నియమితులయిన[1] ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ 2023 సెప్టెంబరు 12న ఉత్తర్వులు జారీచేసింది.[2]

నిడుమోలు మాలా
జననం
శ్రీరంగం మాలా
వృత్తిమద్రాసు హైకోర్టు న్యాయమూర్తి
జీవిత భాగస్వామినిడుమోలు రాధారమణ, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉన్నతాధికారి
పిల్లలుఇద్దరు కుమారులు. శ్రీనివాస్‌ జయప్రకాశ్‌, సాయి ప్రదీప్‌
తల్లిదండ్రులు

ప్రారంభ జీవితం

మార్చు

శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), సరోజా దంపతుల నలుగురి సంతానంలో మాలా చివరి అమ్మాయి. ఆమె మద్రాస్‌ లా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. ఆ తరువాత 1989లో మద్రాస్-పుదుచ్చేరి బార్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకుంది. ఆమె 32 ఏళ్ల పాటు మద్రాస్‌ హైకోర్టులో ప్రాక్టీసు చేసింది. 2020 నుంచి రెండేళ్లపాటు పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించింది.

మూలాలు

మార్చు
  1. "మద్రాస్‌ హైకోర్టు అదనపు జడ్జిగా శ్రీశ్రీ కుమార్తె మాలా". EENADU. Retrieved 2022-03-26.
  2. "Latest Telugu News, తెలుగు వార్తలు, Telugu News Today Live, ఈరోజు వార్తలు, Online Telugu News, తెలుగు న్యూస్ లైవ్ - Samayam Telugu - Samayam Telugu". web.archive.org. 2023-07-07. Archived from the original on 2023-07-07. Retrieved 2023-09-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)