నినాదం
నినాదం : సాహిత్యపరంగా చూస్తే దీనర్థం, ఉద్దేశంతో కూడిన పరిచయ వ్యాఖ్య. ఒక వ్యక్తి, సంఘం, సంస్థ, లేదా దేశం యొక్క సాధారణ లేదా విశేష ఉద్దేశం.
ఈ నినాదాల వర్గీకరణ ఈ విధంగా వుంటుంది. సంస్థలు, రాజకీయ పార్టీలు, ఉద్యమాలు, మతపరమైన భావాలు, దేశములు మొదలగువాటి ముఖ్య ఉద్దేశాలు.
వీటికి కొన్ని ఉదాహరణలు
- భారతదేశ జాతీయ నినాదం : సత్యమేవ జయతే
- ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదం : జై హింద్
- భారత స్వతంత్ర సంగ్రామ సమయంలో గల నినాదాలు :
- జై బోలో భారత్ మాతాకీ - జై
- ఇంకలాబ్ జిందాబాద్ (ఇంక్విలాబ్ జిందాబాద్),
- వందేమాతరం.
- భారత్-పాక్ 1965 యుద్ధ సమయంలో లాల్ బహాదుర్ శాస్త్రి ఇచ్చిన నినాదం : "జైజవాన్ జైకిసాన్"
- నేటి భారతీయుల నినాదం : మేరా భారత్ మహాన్
- వాజపేయి ఇచ్చిన నినాదం : జైజవాన్, జైకిసాన్, జైవిజ్ఞాన్
అలాగే ముస్లింలు ఈ విధముగా నినదిస్తారు : నారయే తక్బీర్ - అల్లాహ్ ఒ అక్బర్ (ఈశ్వర నినాదం - అల్లాహ్ గొప్పవాడు)