నిన్ను తలచి మైమరచా (పాట)

నిన్ను తలచి మైమరచా అను పాట విచిత్ర సోదరులు (1989) చిత్రం లోనిది. సంగీతం: ఇళయరాజా. సాహిత్యం: రాజశ్రీ. గాత్రం : ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం

"నిన్ను తలచి మైమరచా"
సంగీతంఇళయరాజా
సాహిత్యంరాజశ్రీ
ప్రచురణ1989
భాషతెలుగు
రూపంవిషాద గీతం
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
చిత్రంలో ప్రదర్శించినవారుకమల్ హాసన్

నేపథ్యం మార్చు

మరుగుజ్జు గా జన్మించిన అప్పు కమల్ హాసన్ ఒక సర్కస్ లో పని చేస్తూ ఉంటాడు. ఆ సర్కస్ యజమాని కూతురు (రూపిణి)ని ప్రేమిస్తాడు. తాను వేరొకరిని అప్పటికే ప్రేమిస్తోందని, ఆ ప్రేమ తన తండ్రికి ఇష్టం లేదు కాబట్టే సాక్షి సంతకాల కోసమే అప్పుతో స్నేహిస్తోందని అప్పుకి తెలియదు. తన వివాహానికి ఆహ్వానించిన తర్వాత అక్కడికి వెళ్ళిన అప్పు అసలు విషయం తెలుసుకొని భగ్న హృదయుడౌతాడు. ఆ సందర్భంలోనే ఈ పాట. పాట ముగిసే ముందు అప్పు నవ్వుముఖం గల బఫూన్ మాస్క్ ని ఒకటి తొడిగి, దానిని తీసివేసి విలపిస్తాడు. (సర్కస్ కళాకారులు ప్రేక్షకులని రంజింపచేయటానికి ఎన్ని బాధలున్నా వేషం వేసుకొంటారని తెలుపటానికి కాబోలు.) కోపంతో ఆ మాస్క్ ని పైకి విసరగా అది ఉరి వేసుకొన్నట్లు చెట్టుకి వ్రేలాడుతుంది. తనకి మరణమే శరణమని ఉరి వేసుకొంటున్న అప్పుని తల్లి చూసి, అతణ్ణి రక్షించి, తను మరుగుజ్జుగా పుట్టటానికి నిండునెలల గర్బిణిగా ఉన్నప్పుడు దుష్టులు తన తండ్రి మీద కోపంతో అతనిని చంపించి తనని బలవంతంగా విషం త్రాగించటమే అని నిజం చెబుతుంది. దుష్టచతుష్టయాన్ని అంతమొందించటానికి అప్పు ఈ పాటతోనే పూనుకొనటంతో చిత్రంలో ఈ పాటకి చాలా ప్రాముఖ్యత గలదు.

పాటలో కొంత భాగం మార్చు

నిన్ను తలచి, మై మరచా
చిత్రమే, అది చిత్రమే

నిన్ను తలచి, మై మరచా
చిత్రమే, అది చిత్రమే
నన్ను తలచి, నవ్వుకొన్నా
చిత్రమే, అది చిత్రమే

ఆ నింగినెన్నటికీ, ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే, ఈ నాడు తెలిసెనులే
ఓ చెలీ

||నిన్ను తలచి||