నిమ్మగడ్డి (Lemon grass) ఒక బహువార్షిక జాతికి చెందిన ఒక గడ్డి మొక్క.ఈ మొక్కలు 3 నుండి 4 అడుగుల ఎత్తువరకు గుబురుగా పెరుగుతుంది.వర్షపునీటి ప్రవాహం వల్ల వచ్చే నేల కోతలు పడకుండా అరికట్టటానికి ఈ పంట ఉపయోగపడుతుంది.నిమ్మగడ్ది నుండి నూనెను ఉత్పత్తి చేస్తారు.నిమ్మనూనె వాడకం ఇప్పటిది కాదు.దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వంటకాలలోనూ, పరిమళాల పరిశ్రమలలోనూ, సౌందర్యచికిత్సల్లో,ఇంకా విటమిను ఎ తయారికీ దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. నిమ్మనూనెలో సిట్రాల్ అనే రసాయనముంటుంది.[1]ఇది మంచి సవాసుననిస్తుంది.

నిమ్మగడ్డి
నిమ్మగడ్డి మొక్కలు.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
సింబోపోగాన్

నూనె తీసే పద్ధతి సవరించు

నిమ్మగడ్డి నూనె తీసే యంత్రం డిస్టిలేషన్ టాంకు,బాయిలర్,కండెన్సర్,సఫరేటర్ అనేభాగాలు ఉంటాయి. తాజా నిమ్మగడ్డి ఆకులను తీసుకుని డిస్టిలేషన్ టాంకులో నింపి మూతపెట్టి నీటి ఆవిరిని పంపాలి. నూనె ఆవిరి నీటి ఆవిరిద్వారా ద్రవ రూపంలోకి మారి, కండెన్సర్ ద్వారా సఫరేటర్లోకి చేరింది. దీనిని శుభ్రపరిచి నిల్వ చేసుకోవచ్చు.[1]

నిమ్మగడ్డి నూనె ఉపయోగాలు సవరించు

 • స్నానాల గదులలో వచ్చే దుర్వాసనను పోగొట్టటానికి నిమ్మనూనెలో ముంచిన దూదిని వాడతారు.
 • చెడు వాసనలను అరికట్టటానికి నిమ్మనూనెతో మరిగించిన నూనె ద్వారా ధూపం వేస్తారు.
 • వర్షాకాలంలో ఇండ్లలో దోమలు,ఈగలు ఎక్కువుగా ఉన్నప్పుడు నీటిలో రెండుచుక్కలు నిమ్మగడ్డి నూనె రెండు చుక్కలు వేసి ఆ ప్రాంతంలో తుడవటం,లేదా చల్లటం ద్వారా నివారించవచ్చు.[2]
 • నిమ్మగడ్డి నూనెలో ఆస్ట్రిజెంట్ సుగుణాలు ఉన్నందున, దీనిని స్కిన్‌టోనర్‌గా చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది.
 • పేలు,చుండ్రు, కీళ్లనొప్పులుకు,జలుబు,జ్వరం నివారణలకు మందులాగా ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీమైక్రోబయల్‌, యాంటీ పైరెటిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌ సుగుణాలే అందుకు కారణం.
 • ఒత్తిడిని ఎదుర్కొనేవారు దీని సవాసన ద్వారా మనసుకు సాంత్వననివ్వడంలో ఉపయోగపడుతుంది
 • శరీరంలో అతిగా స్పందించే గ్రంథుల్ని కూడా సమతూకంలో ఉండేలా నియత్రించగల శక్తి నిమ్మగడ్డి నూనెకు ఉంది.

నిమ్మగడ్డి ఉపయోగాలు సవరించు

నిమ్మగడ్డి ద్వారా తయారైన టీ త్రాగటంవలన జీర్ణ క్రియ వేగవంతం చేస్తుంది.భావోద్వేగాలను నియంత్రించి ఒత్తిడినిట్టే దూరం చేస్తుంది.లెమన్ గ్రాస్ టీ త్రాగటంవలన ఆరోగ్యపరంగా చూస్తే శరీరంలోని చెడు రసాయనాలు, మలినాలు తొలగిపోతాయని తెలుస్తుంది.దీనికున్న నిమ్మసువాసనే అందుక్కారణం. అందుకే అప్పుడప్పుడు భోజనానికి ముందు లేదా తర్వాతైనా కొద్దిగా నిమ్మగడ్డి టీ తాగడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. చాలా స్పాల్లో నిమ్మగడ్డి టీ వెల్‌కమ్‌ డ్రింక్‌గా ఇస్తారు.నిమ్మగడ్డిని సన్నగా తురిమి రోజూ తీసుకునే వంటకాలపై చల్లుకుని తినవచ్చు. నిమ్మగడ్డి పొడి, కొబ్బరిపాలు చక్కని కాంబినేషన్‌. చేపలు, చికెన్‌ తదితర వంటకాల్లో కొబ్బరిపాలతో పాటు నిమ్మగడ్డిని కూడా చేర్చవచ్చు. వేపుళ్లు కూరలు, పప్పులు, సలాడ్స్‌…పచ్చళ్లు ఇలా ఎలాంటి వంటకంలోనైనా నిమ్మగడ్డిని వాడవచ్చు.[3]

నిమ్మగడ్డి, నిమ్మనూనె వలన నష్టాలు సవరించు

నిమ్మగడ్డిని కానీ,నిమ్మనూనె ను కానీ వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఒక్కోసారి దీనివల్ల ఎలర్జీలు రావచ్చు.తగు మోతాదులో వాడవలసిన అవసరం ఉంటుంది.[3]

నిమ్మగడ్డిలో కొన్ని జాతులు సవరించు

 • సింబోపోగన్ పెండలస్ (జమ్మూ నిమ్మగడ్డి)
 • సింబోపోగన్ ఫ్లెక్సువ్సస్ (తూర్పు భారత నిమ్మగడ్డి)
 • సింబోపోగన్ సిట్రాటస్ (పడమటి భారత నిమ్మగడ్డి)


ta:அருகம் புல்

మూలాలు సవరించు

 1. 1.0 1.1 http://www.apagrisnet.gov.in/Panchangam/sughandatylam/Nimmagaddi.pdf
 2. "తాజా పరిమళం కోసం | మానవి | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-07-04.
 3. 3.0 3.1 "Vaartha Online Edition". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-06-01. Archived from the original on 2020-07-04. Retrieved 2020-07-04.

వెలుపలి లంకెలు సవరించు