నిరుపమ రాఘవన్ తొలి భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త.[1]

నిరుపమ రాఘవన్
నిరుపమ రాఘవన్
జననంమద్రాసు
మరణం2007 ఫిబ్రవరి 23
చెన్నై
రంగములుఖగోళ భౌతిక శాస్త్రవేత్త
వృత్తిసంస్థలుసోలార్ అబ్జర్వేటరీ, కొడైకెనాల్
నెహ్రూ ప్లానిటోరియం,ఢీల్లీ లో డైరక్టర్

జీవిత విశేషాలు

మార్చు

ఒక దశాబ్ద కాలం పాటు న్యూఢిల్లీలోని నెహ్రూ ప్లానిటోరియం డైరక్టరుగా పనిచేసిన ఈమె మద్రాసులో జన్మించారు. బాల్యం నుండి అంతరిక్షం మీద ఆసక్తి పెంచుకొని, విజ్ఞాన శాస్త్రంలో ఉన్నత విద్యను చదివారు. కొడైకెనాల్ లోని సోలార్ అబ్జర్వేటరీలో కొంతకాలం పరిశోధనలు నిర్వహించారు. ఆ తర్వాత కాన్పూర్, ఢిల్లీ నగరాలలోని ఐ.ఐ.టి ఆస్ట్రోఫిజిక్స్ లెక్చరర్ గా ఉండి విద్యార్థులలో రోదసి విజ్ఞానాన్ని నూరిపోసారు.

డాక్టర్ నిరుపమ గారు ప్రధానంగా యువతలో విశ్వజ్ఞానం మీద ఆసక్తి, అభిరుచిని కలిగించడానికి విశెష కృషి చేసారు. అంతరిక్ష రంగంలో మాతృదేశం ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తన వంతు పాత్ర పోషించారు. విజ్ఞాన శాస్త్రం అంతరిక్ష రంగం గూర్చి విశేష ప్రచారం చేసారు. విద్యార్థుల అవగాహనకు అందే రీతిలో "Celestial Hide and Seek" అనే పేరుతో గ్రహణాల మీద ఒక విజ్ఞాన గ్రంథాన్ని వ్రాసారు. మద్రాసు లోని అడాయార్ లైబ్రరీలో ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు రాసిన లిఖిత ప్రతులను గాఢ అధ్యయనం చేసారు. నక్షత్రముల గమనము నుంచి మన పూర్వీకులు ఏ విధంగా స్ఫూర్తి అందుకున్నదీ వివరిస్తూ పరిశోదహ్నా పత్రాలను వెలువరించారు.[1]

ఖగోళ శాస్త్రాన్ని వురాతత్వ శాస్త్రంతో మేళవించి, సాహిత్యం, గణీత శాస్త్రములకు ముడిపెట్టి పలు పరిశోధనలు చేశారు. జాతీయ అంతర్జాతీయ సదస్సులలో ఉపన్యసించారు. ఈమె భర్త రాఘవన్ కూడా శాస్త్రవేత్త. ఈమెను అన్ని విధాలుగా ప్రోత్సహించి, ఈమె పరిశోధనలకు సహాయ సహకారాలు అందించారు. న్యూఢిల్లీలో "అమెచ్యూర్ అస్ట్రానమర్స్ సొసైటీ"ని స్థాపించి యువతరాన్ని ఖగోళ శాస్త్రం వైపుకు మళ్ళించిన ఆమె 2007, ఫిబ్రవరి 23 న మరణించారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 భారతీయ మహిళా శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లికేషన్స్ విజయవాడ ed.). విజయవాడ: శ్రీవాసవ్య. 1 July 2011. p. 126.

ఇతర లింకులు

మార్చు