నివాసి
నివాసి 2019లో విడుదలైన తెలుగు సినిమా. సి.కళ్యాణ్ సమర్పణలో గాయత్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.ఎస్.రావు నిర్మించిన ఈ సినిమాకు సతీష్ రేగల్ల దర్శకత్వం వహించాడు. శేఖర్ వర్మ, వివియా సంత్, జయ ప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 23 ఆగస్టు 2019న విడుదలైంది. [1]
నివాసి | |
---|---|
దర్శకత్వం | సతీష్ రేగల్ల |
రచన | సతీష్ రేగల్ల |
స్క్రీన్ ప్లే | సతీష్ రేగల్ల |
కథ | సతీష్ రేగల్ల |
నిర్మాత | కే ఎన్ రావు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | చిట్టి బాబు. కె |
కూర్పు | జె. ప్రతాప్ కుమార్ |
సంగీతం | చరణ్ అర్జున్ |
నిర్మాణ సంస్థ | గాయత్రీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 23 ఆగస్టు 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఅమెరికాలో సెటిల్ అయిన సూర్యనారాయణ వర్మ(జయ ప్రకాష్) ఒక బిలినియర్. తన కొడుకు వివాన్ ఆదిత్య(శేఖర్ వర్మ)ను చాలా గారాబంగా ఏ కష్టం తెలీకుండా పెంచుతాడు. దాంతో తన కొడుకుకి ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటాడు. అసలు ప్రపంచం అంటే ఏమిటి ? మనుషుల మధ్య వుండే బంధాలు బంధుత్వాలు ఎలా ఉంటాయి? తెలుసుకోమని కొన్ని షరతులు విధించి ఇండియాలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లమంటాడు. అలా వెళ్లిన హీరోకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? తన తండ్రి ఆశించిన విధంగా తనలో మార్పులు వచ్చాయా ? తన మూలాలను కనుగొన్నాడా? అనేదే మిగతా సినిమా కథ. [2]
నటీనటులు
మార్చు- శేఖర్ వర్మ
- వివియా సంత్
- విద్య
- జయ ప్రకాష్
- సుదర్శన్
- జబర్దస్త్ కొమరం
- జబర్దస్త్ రాజమౌళి
- జబర్దస్త్ గణపతి
- కోటేశ్వరరావు
- వేదం నాగయ్య
- ప్రేమా
- సంగీత
- ప్రభావతి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: గాయత్రీ ప్రొడక్షన్స్
- నిర్మాత: కె.ఎస్.రావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్ రేగల్ల
- సంగీతం: చరణ్ అర్జున్
- సినిమాటోగ్రఫీ: కె.చిట్టి బాబు
- ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్
- కొరియోగ్రఫి: భాను మాస్టర్, ప్రసాద్ మాస్టర్
- ఆర్ట్: మురళి వీరవల్లి
- పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను
- స్టంట్స్: షయెలిల్ మల్లేష్
మూలాలు
మార్చు- ↑ The Times of India (23 August 2019). "Nivaasi Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
- ↑ Say Cinema (23 August 2019). "Say Cinema: Nivasi Movie Review Rating, Nivasi Review". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.