నిశ్చల్ నారాయణ్
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
నిశ్చల్ నారాయణ్ హైదరాబాద్ కి చెందిన గణిత మేధావి. ఇటీవల 132 అంకెలను ఏకబిగిన చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు పదమూడేళ్ల కుర్రాడు. నిమిషం వ్యవధిలో తెరపై చూసిన 132 అంకెలను గుర్తుపెట్టుకొని మళ్లీ యథావిధిగా చెప్పడమే రికార్డు లక్ష్యం. అయితే నిశ్చల్ తన అపారమైన జ్ఞాపక శక్తితో వాటిని అవలీలగా చెప్పి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. 2006లో 225 వస్తువులను గుర్తుపెట్టుకొని 'మోస్ట్ ర్యాండమ్ అబ్జెక్ట్ మెమొరీ' విభాగంలో నిశ్చల్ తొలిసారి గిన్నిస్ రికార్డు కెక్కాడు. రెండోసారి నిశ్చల్ ఇచ్చిన ఈ అరుదైన ప్రదర్శనను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పరిశీలనకు పంపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిశ్చల్ తెలుగుబిడ్డ కావటం గర్వకారణమని సీఎం రోశయ్య పేర్కొన్నారు. అతడి ఆసక్తిని గమనించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు నాగేశ్వరరావు, పద్మావతి, శిక్షణనిచ్చిన స్క్వాడ్రన్ లీడర్ జయసింహను అభినందించారు. [1]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-25. Retrieved 2009-09-14.