నిస్రీన్ ఫౌర్ (ఆగస్టు 2, 1972) ఇజ్రాయెల్ కు చెందిన పాలస్తీనా రంగస్థలం, సినిమా నటి. 2009లో వచ్చిన అమెరికా చలనచిత్రమైన అమ్రీకాలో మనా పాత్రలో నటించి, గుర్తింపు పొందింది.

నిస్రీన్ ఫౌర్
జననంఆగస్టు 2, 1972
తర్షిహా, ఇజ్రాయెల్
వృత్తినటి

నిస్రీన్ ఫౌర్ 1972, ఆగస్టు 2న ఇజ్రాయెల్ లోని తర్షిహా లో జన్మించింది.

వృత్తి జీవితం

మార్చు

నిస్రీన్ ఫౌర్ 16 సంవత్సరాల వయసులోనే రంగస్థల విద్య, ప్రదర్శనల కోసం ఇజ్రాయెల్ నుండి యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లింది. 1991-94 మధ్యకాలంలో టెల్ అవీవ్ లోని కిబ్బుట్జిమ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలలో నటనపై అధ్యయనం చేసి, ఇజ్రాయెల్ కు వచ్చింది. హైఫా విశ్వవిద్యాలయంలో దర్శకత్వం చేస్తూ, అనేక బహుమతులు పొందిన నాటకాలలో నటించింది. ఆలీ నాసర్ దర్శకత్వం వహించిన యైత్ మంత్ చిత్రంలో జమ్ర్ అల్హికాయ (విస్పరింగ్ ఎంబర్స్), ది సేవియర్ వంటి ఇజ్రాయెల్ చిత్రాలలో నటించింది. ఇజ్రాయెల్ బ్రాడ్ కాస్టింగ్ అథారిటీ ద్వారా నిర్మించబడి, ఛానల్ 33, మిష్వార్ అల్-జోమా ల ద్వారా ప్రసారం చేయబడిన ఫ్యామిలీ డీలక్స్ అనే టెలివిజన్ కార్యక్రమంలో కూడా నిస్రీన్ నటించింది.[1]

2009లో వచ్చిన అమ్రీకాలోని నటనకుగానూ విమర్శకులనుండి ప్రశంసలు అందుకుంది.

పురస్కారాలు

మార్చు
  1. ముహ్ర్ పురస్కారం - ఉత్తమ నటి, అమ్రీకా (సినిమా), దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (2009)[2]
  2. ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డు - నామినేటెడ్ ఉత్తమ నటి, అమ్రీకా (సినిమా), ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్ (2010)[3]

మూలాలు

మార్చు
  1. "Amreeka Official Site: Cast". Archived from the original on 2013-11-05. Retrieved 2017-06-19.
  2. "2009 Muhr Arab winners". Archived from the original on 2010-07-23. Retrieved 2017-06-19.
  3. "2010 Film Independent's Spirit Awards Nominees and Winners". About.com. 2010. Archived from the original on 15 ఫిబ్రవరి 2010. Retrieved 19 June 2017.