నీటి గడియారం
నీటి గడియారం అనగా ఎత్తునున్న ఒక పాత్ర నుండి దిగువనున్న మరొక పాత్రకు ద్రవ ప్రవాహ క్రమబద్ధీకరణ ద్వారా నీటిని పంపుతూ పాత్రలలో నీటి హెచ్చుతగ్గుల కొలతలను బట్టి సమయాన్ని తెలుసుకునే ఒక రకపు గడియారం. నీటి గడియారాలు సమయాన్ని తెలుసుకొనుటకు ఉన్న సూర్యగడియారాలతో పాటున్న పురాతన సమయ కొలత సాధనాలు. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు కనిపెట్టారో తెలియని అప్పటివారి నుంచి అందుకున్న గొప్ప ప్రాచీనమైనది. గిన్నె ఆకారపు అవుట్‌ఫ్లో నీటి గడియారం యొక్క సాధారణ రూపం, ఇటువంటి నీటి గడియారాలు 16 వ శతాబ్దం BC దరిదాపుల్లో బాబిలోన్, ఈజిప్ట్ లో ఉండేవని అంటారు. భారతదేశం, చైనా సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు నీటి గడియారాల యొక్క పూర్వ ఆధారాలను కలిగి ఉన్నాయి, అయితే ఫలానా కాలంలో మొట్టమొదట వాడబడినవి అని నిర్దిష్టంగా చెప్పలేక పోతున్నవి. అయితే కొంతమంది రచయితలు చైనాలో కనిపించిన నీటి గడియారాలు క్రీ.పూ 4000 కాలానికి చెందినవని వాదిస్తారు.