జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్గ్రాడ్యుయేట్) (లేదా నీట్ (యుజి) ) భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్ (ఎఐపిఎంటి) అనేవారు. వివిధ రాష్ట్రాలు, కళాశాలలూ గతంలో స్వంతంగా నిర్వహించుకుంటూ ఉన్న ప్రవేశ పరీక్షలన్నిటినీ రద్దుచేసి, వాటి స్థానంలో నీట్-యుజిని నిర్వహిస్తున్నారు.
ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల కోసం నీట్ (యుజి) ని ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహిస్తోంది. ఇది, పరీక్షా ఫలితాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్‌కు అందిస్తుంది.[1] 2019 కి ముందు, అమెరికాలో ప్రధాన కార్యాలయం ఉన్న ప్రోమెట్రిక్ టెస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) ఈ పరీక్షను నిర్వహించేది. [2]
2019 సెప్టెంబరులో ఎన్‌ఎంసి చట్టం 2019 ను అమలు చేసిన తరువాత, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్‌లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (జిప్మెర్) తో సహా భారతదేశంలోని మెడికల్ కాలేజీలన్నిటిలో ప్రవేశానికి నీట్-యుజి సాధారణ ఆల్ ఇండియా ప్రవేశ పరీక్షగా మారింది. అప్పటి వరకు ఎవరికి వారే ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించేవారు. [3]
భారతదేశం అంతటా 66,000 ఎంబిబిఎస్, బిడిఎస్ సీట్లలో ప్రవేశానికి జరిపే ఒకే ప్రవేశ పరీక్ష, నీట్-యుజి. [4] ఈ పరీక్షను వివిధ భాషల్లో రాయవచ్చు. 2018 లో 80% మంది అభ్యర్థులు ఇంగ్లీషులో రాయగా, హిందీలో 11%, గుజరాతీలో 4.31%, బెంగాలీలో 3%, తమిళంలో 1.86% మందీ నీట్ పరీక్ష రాశారు. [5] [6]
పరీక్షా విధానం, నిర్మాణం
మార్చుపరీక్షలో మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఒక్కొక్కదాని నుండి 45 ప్రశ్నలు, బయాలజీ నుండి 90 ప్రశ్నలూ ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు వస్తాయి. ప్రతి తప్పుకూ ఒక మార్కు కోసేస్తుంది అంటే మైనస్ 1 మార్కు అన్నమాట. పరీక్ష వ్యవధి 3 గంటలు, గరిష్ఠ మార్కులు 720.
సంవత్సరం వారీగా దరఖాస్తుదారుల సంఖ్య
మార్చుసంవత్సరం | దశ | దరఖాస్తుదారుల సంఖ్య |
---|---|---|
2019 | ఏడాదికి
ఒకసారి జరిగింది |
1,410,755 [7] |
2018 | 1,326,725 [8] | |
2017 | 1,138,890 [8] | |
2016 | 2 | 802.594 |
1 | ||
2015 | ఏడాదికి
ఒకసారి |
374,386 [9] |
2014 | ||
2013 |
కటాఫ్ మార్కులు
మార్చువర్గం | కనీస అర్హత శాతం |
---|---|
2019 నాటికి | |
రిజర్వ్ చేయని (యుఆర్) | 50 వ పర్సెంటైల్ |
రిజర్వ్ చేయని PH (UR-PH) | 45 వ పర్సెంటైల్ |
షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) | 40 వ పర్సెంటైల్ |
షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) | 40 వ పర్సెంటైల్ |
ఇతర వెనుకబడిన తరగతులు (OBC) | 40 వ పర్సెంటైల్ |
SC-PH | 40 వ పర్సెంటైల్ |
ST-PH | 40 వ పర్సెంటైల్ |
ఒబిసి-PH | 40 వ పర్సెంటైల్ |
కాలేజీలు
మార్చునీట్ కింద ఇచ్చే మొత్తం సీట్ల సంఖ్య 66,000. నీట్ ర్యాంకు ఆధారంగా విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలో సీటు పొందే అవకాశం ఉంటుంది. [10] వివిధ రంగంలోని కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య కింది విధంగా ఉంది.
కళాశాలలు | ఉన్న సీట్ల సంఖ్య |
---|---|
అన్ని ప్రైవేట్ కళాశాలలు | 25.840 |
అన్ని ప్రభుత్వ కళాశాలలు | 27.590 |
నీట్ కౌన్సెలింగ్ సీట్లు | 3,521 |
నీట్ బేసిస్ సీట్లు | 35.461 |
మూలాలు
మార్చు- ↑ "NEET-FAQ". Archived from the original on 2020-10-26. Retrieved 2020-08-15.
- ↑ "Archived copy". Archived from the original on 2017-09-10. Retrieved 2020-08-15.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Sharma, Neetu Chandra (2019-10-04). "Common NEET under graduate exam from 2020-21 as per NMC Act: Centre" (in ఇంగ్లీష్).
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;bdsneedt
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;neeteng
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Pathak, Vikas (4 June 2018). "Rajasthan, A.P., Kerala record top performances in NEET". The Hindu.
- ↑ "NEET 2019: 14 lakh candidates in 154 cities tested in 11 languages; nearly 8 lakh candidates qualified" (in Indian English). 2019-06-06.
- ↑ 8.0 8.1 "NEET 2018 analysis: Pass percentile, toppers and comparison with last year's exam". India Today (in ఇంగ్లీష్). Ist. Retrieved 2019-07-23.
- ↑ "CBSE AIPMT 2015: Result statistics". India Today (in ఇంగ్లీష్). Ist. Retrieved 2019-08-05.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;bdsneedt2
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు