నీతిమతి రాగము
60వ మేళకర్త రాగము
నీతిమతి రాగము కర్ణాటక సంగీతం లో 60వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితులు పద్ధతిలో దీనిని నిషాధం అంటారు.[1][2][3]
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
- S R2 G2 M2 P D3 N3 S
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
- S N3 D3 P M2 G2 R2 S
ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, షట్స్రుతి ధైవతం, కాకళి నిషాధం. ఇది ఒక సంపూర్ణ రాగం. ఇది 24వ మేళకర్త రాగమైన వరుణప్రియ రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
ఉదాహరణలు
మార్చుఈ రాగంలోని కొన్ని రచనలు:
- వాచామగోచర - త్యాగరాజ స్వామి
- స్మరణం - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
జన్య రాగాలు
మార్చుఈ రాగానికి కొన్ని జన్యరాగాలు ఉన్నాయి. వానిలో హంసనాదం ప్రసిద్ధిచెందినది.
హంసనాద రాగం
మార్చు- బంటు రీతి కొలువు - త్యాగరాజ కీర్తన.